స్టాలిన్‌ ఒకటోస్సారి..! విజయన్ రెండోస్సారి..! మమత మూడోస్సారి..!?

ముఖ్యమంత్రి.. ఆధునిక ప్రజాస్వామ్యంలో ఈ పదవి సాధారణమైంది కాదు.. ఓ రాష్ట్రానికి రాజు ముఖ్యమంత్రే.. రాష్ట్రానికి అధికార పీఠం ఆయనిదే. అలాంటి పీఠం అధిరోహించాలన్నది సాధారణ రాజకీయ నాయకుడి లక్ష్యం.. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి ముఖ్యమంత్రులు అవుతున్న వారిలో విచిత్రమైన పోలిక ఉంది.. అదే స్టాలిన్‌ ఒకటోసారి.. విజయన్ రెండోసారి.. మమత మూడోసారి..

స్టాలిన్‌.. డీఎంకే అధినేత.. ప్రజాబలం గల నాయకుడు.. కానీ.. ఇటీవలి కాలం వరకూ ఆయన తండ్రి కరుణానిధి క్రియాశీల రాజకీయాల్లో ఉండటంతో స్టాలిన్ కు ముఖ్యమంత్రి పీఠం అందలేదని చెప్పాలి. గతంలో పదేళ్ల క్రితం కరుణానిధి పార్టీ తమిళనాట విజయం సాధించినప్పుడు .. అప్పటికే వయస్సు మీదపడిన కరుణానిధి.. ముఖ్యమంత్రి పీఠం స్టాలిన్‌కు ఇస్తాడని భావించారు. కానీ అప్పుడు కరుణానిధే సీఎం అయ్యారు. ఆ తర్వాత జయలలిత.. వరుసగా రెండు సార్లు అధికారం చేజిక్కుంచుకోవడంతో  సీఎం కుర్చీ కోసం స్టాలిన్‌కు ఎదురు చూపులు తప్పలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన సీఎం కల నెరవేరబోతోంది.

ఇక విజయన్ విషయానికి వస్తే.. నిజాయితీ కల నాయకుడిగా పేరున్న విజయన్.. తాజా విజయం ద్వారా కేరళ చరిత్రను తిరగ రాశారు. ఎందుకంటే.. గత 40 ఏళ్లలో కేరళలో ఏ ఒక్కసారి కూడా అధికార పార్టీ అధికారం నిలబెట్టుకోలేదు. ఇక్కడ అధికార పార్టీని గద్దె దింపడం కేరళ వాసులకు ఓ ఆనవాయితీగా వస్తోంది.. 40 ఏళ్ల తర్వాత ఆ సంప్రదాయానికి విజయన్ బ్రేక్ వేశారు. 40 ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి సీఎం కుర్చీ ఎక్కబోతున్నారు.

ఇక అందరికంటే ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి కాబోతున్నది మమతా బెనర్జీగా చెప్పాలి. వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఈ అరుదైన పొలిటికల్ ఫీట్‌ ను ఆమె అలవోకగా సాధించారు. ముచ్చటగా మూడోసారి సీఎం కాబోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: