ఈ ఈనాడు కథనం.. జగన్‌ సర్కారుకు అవమానం..?

ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కొన్ని తరాలను ప్రభావితం చేసేలా ఉన్నాయి. ప్రత్యేకించి విద్యారంగంలో తీసుకుంటున్న నిర్ణయాలు విప్లవాత్మకంగా ఉంటున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల పిల్లల చదువుల కోసం ఏపీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు కురుస్తున్నాయి. నాణ్యమైన మధ్యాహ్న భోజనం,మన్నికైన, ఆకర్షణీ దుస్తులు, బూట్లు, పుస్తకాలు, వాటిని మోసే సంచీ.. ఇలా అన్నీ అందించడం ఇంగ్లీష్ మీడియం చదివించడం వంటి నిర్ణయాలు కొన్ని తరాలపై ప్రభావం చూపుతాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అయితే.. పథకాలు బాగున్నా.. వాటి అమల్లో కొన్ని చోట్ల వైఫల్యం కనిపిస్తోంది. ఆ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ఈనాడు మొదటి పేజీలో ప్రచురించిన కథనం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టింది. అధికారుల నిర్లక్ష్యం... గుత్తేదారులు సరకుల సరఫరా నిలిపేయడం కారణంగా సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు ఆకలి కేకలు పెడుతున్నారంటూ ఈనాడు ఫస్ట్ పేజీలో ఓ వార్త ప్రచురించింది. గురుకులాలకు కూరగాయలు, నూనె, పప్పులు, కారం తదితరాలను సరఫరా చేసే గుత్తేదారులకు గత ఏడాది నవంబరు నుంచి బిల్లులు రాకపోవడంతో వారు సరకుల సరఫరా నిలిపేశారని తెలిపింది.

తూర్పుగోదావరి జిల్లాలో గుత్తేదారుకు రూ.2.50 కోట్ల బకాయి ఉండటంతో సరకుల సరఫరా పూర్తిగా నిలిపేశారని... ప్రధానోపాధ్యాయులు సొంతంగా ఖర్చు చేసుకుని సరకులు తెప్పిస్తున్నారని ఈనాడు రాసింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ సరకులు పంపిణీ చేయబోమని గుత్తేదారులు తేల్చిచెప్పారట.. ఇతర జిల్లాల్లోనూ పరిస్థితి తీవ్రంగానే ఉందట.  రూ.కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంటే సరకులు ఎలా సరఫరా చేస్తామని వారు ప్రశ్నిస్తున్నారట.

జగన్ సర్కారు.. అసలు ఈ విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సమస్యను తక్షణం పరిష్కరించాలి.. లేకపోతే.. ఎన్నో కార్యక్రమాల ద్వారా వచ్చిన మంచి పేరు.. ఇలాంటి నిర్లక్ష్యం కారణంగా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. జగన్ సర్కారు మేలుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: