కత్తి మహేశ్ కౌంటర్‌కు.. జర్నలిస్ట్ సాయి రివర్స్ కౌంటర్..?

కత్తి మహేశ్.. ఈయన ఓ మల్టీ టాలెంటెడ్ పర్సన్.. సినిమా రివ్యూలు రాస్తుంటారు.. సినిమాలు డైరెక్ట్ చేస్తారు.. సినిమాల్లో నటిస్తారు.. రాజకీయాలపై విమర్శలు గుప్పిస్తారు. రాజకీయాలను విశ్లేషిస్తారు. ఇక సీనియర్ జర్నలిస్టు సాయి కూడా సోషల్ మీడియాలు ఫాలో అయ్యే వారికి బాగానే పరిచయం. అయితే జర్నలిస్టు సాయి చేసిన ఓ విశ్లేషణపై కత్తి మహేశ్ స్పందించారు. తన స్పందనను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ స్పందనపై అటు జర్నలిస్టు సాయి కూడా స్పందించారు. తన వివరణను సమర్థించుకున్నారు.

కత్తి మహేశ్ స్పందన.. దానికి జర్నలిస్టు సాయి రివర్స్ కౌంటర్.. రెండూ హుందాగానే జరగడం విశేషం. ఇంతకీ సాయి వీడియోలో ఏముందుంటే.. ఇటీవల జగన్ తిరుపతి ఎన్నికల ప్రచారానికి వెళ్తారని సమాచారం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. కరోనా ఉద్ధృతి పెరుగుతున్న దృష్ట్యా తిరుపతి పర్యటన రద్దయిందని.. ఆయన బహిరంగ లేఖ ద్వారా వైసీపీకి ఓటేయమని కోరారు. దీనిపై జర్నలిస్టు సాయి విశ్లేషిస్తూ.. సీఎం జగన్ ఎమోషనల్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు.

జర్నలిస్టు సాయి విశ్లేషణపై కత్తి మహేశ్ ఫేస్ బుక్‌లో స్పందించారు. కత్తి మహేశ్ ఏమన్నారంటే.. "ఎమోషనల్ గేమ్" ఏంది జర్నలిస్ట్ సాయన్నా? ఒక బాధ్యతగల పార్టీనాయకుడిగా,ముఖ్యమంత్రిగా ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుపతి బహిరంగ సభ క్యాన్సిల్ చేశానని చెప్పారు కదా? ఇందులో గేమ్ ఏముంది? రాజకీయమే పరమావధి అనుకుని. విచ్చలవిడిగా కరోనా వ్యాప్తి గురించి పట్టించుకోకుండా సభపెడితే ఎమోషనల్ గేమ్ గానీ... ఇలా ప్రజలే ముఖ్యం మెజారిటీకన్నా. అనే ముఖ్యమంత్రి/ నాయకుడు దొరకడం మంచిది కాదంటావా?!? అని కామెంట్ చేశారు.

మళ్లీ ఈ కామెంట్‌ను జర్నలిస్టు సాయి స్పందిస్తూ.. కత్తి మహేశన్నా..మీరు కత్తి అంటూ థంబ్ నెయిల్ పెట్టి వీడియో చేశారు. తాను తప్పుగా ఏమీ అనలేదని.. ఎమోషనల్ గేమ్ అనే మాట తప్పుకాదని వివరణ ఇచ్చారు. గతంలో కరోనా ఉన్నా ఎన్నికలు పెట్టాలని వైసీపీ కోరిన విషయాన్ని గుర్తు చేశారు. మొత్తానికి సాయి వర్సెస్ కత్తి మాటల యుద్ధం హుందాగానే సాగింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: