వైసీపీ నేతల ఓవర్ కాన్ఫిడెన్స్ జగన్‌ను జైలుకు పంపుతుందా..?

వైసీపీ మొదటి నుంచి బీజేపీతో కాస్త సాఫ్ట్ గానే ఉంటోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో స్నేహంగానే ఉంటోంది. మరీ పైకి స్నేహితులం అని ప్రకటించుకోకపోయినా.. ఎన్డీఏలో వైసీపీ చేరకపోయినా.. అప్రకటిత దోస్తీ ఈ రెండు పార్టీల మధ్య ఉండేది. అయితే ఇప్పుడిప్పుడే ఈ రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఏపీలో ఎదగాలని బీజేపీ ప్రయత్నించడం.. తిరుపతి ఉపఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నించడం కూడా రెండు పార్టీల మధ్య మరింతగా దూరం పెంచాయి.

ఇక ఇప్పుడు తిరుపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ, వైసీపీ నేతలు అచ్చమైన శత్రువుల్లా మారిపోతున్నారు. ఇక రాజకీయం అంటే విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణమేగా.. కానీ ఈసారి రెండు పార్టీల మధ్య ఇవి శ్రుతి మించుతున్నాయి. ఏయ్.. మీ సీఎం జగన్ బెయిల్ మీద ఉన్నాడు.. అది ఎప్పుడైనా రద్దవుద్ది. అప్పుడు చూపిస్తాం మా తఢాఖా అన్నాడో బీజేపీ నాయకుడు కొన్ని రోజుల క్రితం..

ఇక ఇప్పుడు వైసీపీ నేతలు కూడా బాగానే విమర్శిస్తున్నారు. ఏకంగా మోడీని, అమిత్ షాను సీన్‌ లోకి లాగుతూ విమర్శలు చేస్తున్నారు. ఒక్కరిగా వచ్చినా, పవన్, మోడీ కలిసి వచ్చినా, ఎన్ని సినిమాలు ఆడించినా సీఎం వైయస్‌ జగన్‌ భయపడేరకం కాదంటున్నారు మంత్రి పేర్ని నాని వంటి నాయకులు. సోనియా గాంధీ లాంటి నియంతకే కించెత్తు కూడా భయపడని నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌ అని..  చంద్రబాబు, సోనియా కలిసి ఉద్దేశపూర్వకంగా జైల్లో పెట్టినా మనో ధైర్యంతో పోరాడి కాంగ్రెస్‌ను మట్టికరిపించిన వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌ అని గుర్తు చేస్తున్నారు.  

అయితే.. కాంగ్రెస్‌ పెట్టిన తప్పుడు హత్య కేసులో అమిత్‌షా కూడా ముద్దాయిగా ఉన్నాడని..  ఆయన కూడా వాయిదాలకు తిరిగాడని గుర్తు చేస్తున్నారు. అప్పుడు అమిత్‌షా ఎవరికి భయపడ్డాడు.. అమిత్‌షా, వైయస్‌ జగన్‌కు భయాలు ఉండవు. సునీల్‌ దేవ్‌ధర్ లాంటి చెంచాగిరి చేసుకునేవాళ్లు ఇలాంటి పిచ్చికూతలు ఆపాలి అంటూ వైసీపీ నేతలు ఘాటుగా బదులిస్తున్నారు. వీళ్లు ఇలా ఇష్టానుసారం రెచ్చిపోతే.. ఆ మాటలు ఎవరైనా బీజేపీ పెద్దల వరకూ తీసుకెళ్తే..జగన్‌కు ఇబ్బందులు తప్పవేమోనని వైసీపీ నాయకులు కొందరు భయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: