జగడ్డ: జగన్‌పై మరో బాంబు రెడీ చేస్తున్న నిమ్మగడ్డ..!?

పంచాయతీ ఎన్నికల అంశంలో జగన్‌ సర్కారుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై చేయి సాధించిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ మార్చి నెలలో రిటైర్ కాబోతున్నారు. అందుకే ఆయన రిటైర్‌ అయ్యే వరకూ ఏ ఎన్నికలు జరపకుండా చేయాలని జగన్ సర్కారు ఎంతగానో ప్రయత్నించింది. కానీ నిమ్మగడ్డ మహా మొండివాడు కావడంతో జగన్ సర్కారు తలవంచక తప్పలేదు. చివరకు ఇష్టం లేకపోయినా పంచాయతీ ఎన్నికలకు జగన్ సర్కారు సిద్ధమవుతోంది.
ఇంతలోనే జగన్ సర్కారుపై మరో బాంబు వేసేందుకు నిమ‌్మగడ్డ రెడీ అవుతున్నారన్న వార్త కలకలం సృష్టిస్తోంది. అదేంటంటే.. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీ, మునిసిపల్ కార్పొరేషన్, అన్ని డివిజన్లలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు నిమ్మగడ్డ రెడీ అవుతున్నారట. పంచాయతీ ఎన్నికల విషయంలో ఇప్పటికే చుక్కలు చూపిస్తున్న నిమ్మగడ్డ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల విషయంలోనూ జగన్ సర్కారుకు చుక్కలు చూపించే అవకాశం ఉందట. ఈ మేరకు నిమ్మగడ్డ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
పంచాయతీ ఎన్నికలు ముగిసీముగియగానే.. ఫిబ్రవరి 22వ తేదీన రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీ, మునిసిపల్ కార్పొరేషన్, అన్ని డివిజన్లలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు నిమ్మగడ్డ రెడీ అవుతున్నారట. నోటిఫికేషన్ ఇచ్చేస్తారట ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇప్పుడీ వార్త ఏపీ పొలిటికల్ సర్కిళ్లో బాగా షికార్లు కొడుతోంది. అదే నిజం అయితే.. ఏపీ రాజకీయం మరింత రక్తి కట్టబోతోందన్నమాట.
ఇప్పటికే ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశారు. అటు ప్రభుత్వం కూడా ఆయన ఆదేశాలు పాటిస్తోంది. ఇప్పుడు ఏపీలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు చకచకా అమలవుతున్నాయి. తాజాగా ఆయన ఆదేశాల ప్రకారం చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం జీఏడీకి సరెండ్‌ చేసింది. అలాగే ఆయన గతంలో బదిలీ చేసిన డీఎస్పీ, ఇతర పోలీసు అధికారుల బదిలీలు అమలవుతున్నాయి. ఇప్పుడు ఏపీలో పవర్‌ పూర్తిగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ చేతికి వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: