షాకింగ్‌ సీక్రెట్‌: విమానం గాల్లో ఉండగానే ఇంధనం అయిపోతే.. ఏమౌతుంది..?

విమానం.. మనిషి కనిపెట్టిన అత్యుద్భుతమైన విషయాల్లో ఇదొకటి.. అసలు మనిషి గాల్లో ఎగరాలనే ఆలోచన రావడం.. దాన్ని సాకారం చేయడం.. ఇప్పుడు ఏకంగా వేల కిలోమీటర్ల గాల్లో సురక్షితంగా ప్రయాణం చేయడం అద్భుతం కాక మరేమిటి..అందుకే.. విమానం చూస్తే చాలా మందికి అదో ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అలాగే విమానాలకు సంబంధించి అనేక సందేహాలు కూడా కలుగుతుంటాయి.

అసలు ఈ విమాన ప్రయాణం క్షేమమేనా?’  ‘అనుకోని పరిస్థితుల్లో కిటికీ అద్దాలు పగిలిపోతే? ‘విమానం టైర్లు పేలితే ఎలా?’.. తరచూ సందేహాలు పెద్దలకూ వస్తుంటాయి. ఇలాంటి ప్రశ్నలకు  ‘101 ఫ్లయింగ్‌ సీక్రెట్స్‌’ అనే ఆంగ్ల పుస్తకంలో ఆ ప్రశ్నలకు సవివరమైన, శాస్ర్తీయమైన సమాధానాలు ఇచ్చారు హైదరాబాద్‌కు చెందిన రాకేష్‌ ధన్నారపు. ఈ యువకుడు... ఆస్ట్రేలియాలోని రాయల్‌ మెల్‌బోర్న్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదువుకున్నాడు. విమానాలపై అధ్యయనాలు చేశాడు.

ఆయన చెబుతున్నదేంటంటే.. కారులో హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌కు బయల్దేరితే, దార్లో అవసరమైనంత పెట్రోలు పోయించుకుంటాం. ఒకవేళ మధ్యలోనే ఇంధనం అయిపోతే, బంకులో ట్యాంకు నింపుకుంటాం. ఆకాశంలో ఆ ఛాన్స్‌ ఉండదు. అందుకే విమానం ఓ ఐదొందల కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటే... ఆరొందల కిలోమీటర్లకు సరిపడా ఇంధనాన్ని నింపుతారు. వాతావరణం అనుకూలించకపోతే... ఆ విమానం సమీపంలోని మరో ఎయిర్‌పోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి ఉపద్రవాలన్నీ ముందే ఊహించి.. అదనపు ఇంధనాన్ని నింపుతారు.

అయినా ఇబ్బంది అయితే, ‘మాండిటరీ ప్యూయల్‌’ ఉంటుంది. ఆఖరి అరగంటకు సరిపోతుంది. అప్పట్లోగా ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ జరిగిపోతుంది కాబట్టి, సమస్య ఉండదు. ఈ పుస్తక రచనకు తనను అనేక విషయాలు  పురికొల్పాయంటున్నారు రచయిత  రాకేశ్ ధన్నారపు.. ఫోను, వాషింగ్‌ మెషిన్‌, ఎయిర్‌ కండిషనర్‌, వాచీ.. ఏది కొన్నా వినియోగదారుడికి ఓ మాన్యువల్‌ ఉంటుంది. విమాన ప్రయాణికుడికి మాత్రం ఎందుకు లేదు? అన్న ఆలోచనే అతడిని పుస్తక రచనకు  పురిగొల్పిందట. నిజంగానే ఈ పుస్తకం చాలా ఆసక్తికరంగా ఉంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: