హెరాల్డ్ ఎడిటోరియల్ : పెరిగిపోయిన మినీ తెలంగాణా ఎన్నికల హీట్

Vijaya
మినీ తెలంగాణా అంటే గ్రేటర్ హైదరాబాద్ అనే అర్ధం. ఎందుకంటే తెలంగాణాలోని మొత్తం జనాభా సుమారు 4 కోట్లమంది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే సుమారు కోటిమంది జనాభా ఉన్నారు. పైగా తెలంగాణాలో ఎన్ని జిల్లాలున్నాయో అన్నీ జిల్లాలకు చెందిన కుటుంబాల సభ్యులు, బంధువులు హైదరాబాద్ లో ఉన్నారు. వీళ్ళకు అదనంగా దేశంలోని వివిధ రాష్టాలకు చెందిన జనాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు. అందుకనే హైదరాబాద్ ను అందరు ముద్దుగా మినీ తెలంగాణా అని పిలుచుంటుంటారు. మరి ఇటువంటి మినీ తెలంగాణాలో  మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయంటే ఎంత హడావుడి ఉండాలి ? ఎంత రాజకీయ హీట్ పెరిగిపోవాలి ?  మంగళవారం  స్టేట్ ఎలక్షన్ కమీషనర్ పార్ధసారధి ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ కారణంగా రాజకీయ పార్టీల్లో ఒక్కసారిగా ఎన్నికల హీట్ పెరిగిపోయింది.




ఎన్నికల కమీషనర్ ప్రకటించిన విధంగా డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ జరుగుతుంది. 4వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. నవంబర్ 18వ తేదీ నుండి నామినేషన్లను తీసుకుంటారు. మూడు రోజుల తర్వాత అంటే 21వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 22వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఎక్కడైనా అవసరమైతే 3వ తేదీన రీపోలింగ్ జరుగుతుందని పార్ధసారధి ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) మేయర్ స్ధానాన్ని ఎలక్షన్ కమీషనర్ జనరల్ మహిళలకు కేటాయించింది. 150 డివిజన్లలో 2 డివిజన్లను ఎస్టీలకు కేటాయించిన కమీషనర్ 10 డివిజన్లను ఎస్సీలకు రిజర్వు చేసింది. 50 డివిజన్లను బీసీలకు 44 డివిజన్లు జనరల్ మహిళలకు కేటాయించింది. మిగిలిన 44 డవిజన్లను జనరల్ సీట్లుగా డిక్లేర్ చేసింది. అంటే ఈ 44 డివిజన్లలో ఆడ, మగ, సామాజికవర్గాలతో సంబంధం లేకుండా సత్తా ఉన్నవారు ఎవరైనా పోటీ చేయవచ్చు.




జీహెచ్ఎంసి మేయర్ పోస్టును మహిళలకు కేటాయించటంతోనే టీఆర్ఎస్ అడ్వాంటేజ్ కనబడుతోంది. మేయర్ పోస్టును మహిళలకు కేటాయించటం వల్ల ప్రతిపక్ష పార్టీలు డిఫెన్సులో పడిపోయాయి. మామూలుగానే  రాజకీయాల్లో  మగవాళ్ళున్నంత యాక్టివ్ గా ఆడవాళ్ళుండరన్న విషయం అందరికీ తెలిసిందే. ఎక్కడో డీకే అరుణ, గీతారెడ్డి, కల్వకుంట్ల కవిత లాంటి వాళ్ళు మగవాళ్ళకు ధీటుగా నిలిచిన నేతలు అరుదుగా ఉంటారు. ప్రభుత్వం ఆలోచనల ప్రకారమే ఎలక్షన్ కమీషన్ నడుచుకుంటుందన్న విషయంలో సందేహం అవసరం లేదు. కాబట్టి తమ క్యాండిడేట్ ను ముందుగానే టీఆర్ఎస్ రెడీ చేసుకుని ఉంటుందనటంలో సందేహం లేదు. మరి మిగిలిన పార్టీలు అంత తొందరగా  గట్టి మహిళా నేతలను రెడీ చేసుకోగలవా ?  ముందు డివిజన్లలో గెలవాలి తర్వాత మేయర్ పోస్టుకు పోటీ పడాలి. అంత సమయం ప్రతిపక్షాలకు ఉన్నాయా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: