ఛీఛీ.. రాజకీయం కోసం మరీ ఇంత దిగజారతారా..??
అయితే.. కొందరు ప్రబుద్ధులు మాత్రం రాజకీయం కోసం ఎంతకైనా దిగజారతారు.. అధికారం కోసం ఎలాంటి అఘాయిత్యాల కైనా తెగబడతారు.. ఇందుకు తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ సంఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. రాజకీయాల్లో ఎదగాలనే కాంక్షతో ఓ వ్యక్తి సొంత కూతుర్నే హత్య చేశాడు.. ఈ దారుణం నేడు దిగజారుతున్న రాజకీయాలకు ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ దారుణ ఘటన కర్నాటకలోని దావణగెరెలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని గుట్టిదుర్గకి చెందిన నింగప్ప అనే వ్యక్తి త్వరలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు.
అయితే కరెక్టుగా ఇదే సమయంలో తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళతో నింగప్పకి వివాదం ఏర్పడింది. తాను రెండో భార్యనని ప్రజలందరి ముందు ఒప్పుకోవాలని ఆ సెకండ్ సెటప్ డిమాండ్ చేసింది. అసలే ఎన్నికల సమయం.. ఈ సమయంలో ఒప్పుకుంటే ఇంకేమైనా ఉందా.. పరువు పోతుంది కదా అనుకున్నాడు సదరు నింగప్ప. తన అక్రమ సంబంధం విషయం బయటకి తెలిస్తే రాజకీయ జీవితంపై ప్రభావం పడుతుందని భావించాడు.
అంతే.. తన రాజకీయ జీవితానికి అడ్డుగా సాక్ష్యంగా నిలుస్తున్న సొంత కూతుర్ని గుట్టు చప్పుడు కాకుండా చంపేశాడు. ఆ తర్వాత కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు చివరకు నింగప్పే హత్య చేసినట్లు తేల్చారు. నేటి రాజకీయాల్లో దిగజారుతున్న విలువలకు ఇదో చక్కటి ఉదాహరణ అంటున్నారు విశ్లేషకులు. ఇదీ నేటి రాజకీయం.