ఎడిటోరియల్: మార్పు మంచిదే ! అయినా బాబు ను నమ్మేదెవరు ?

టిడిపి అధినేత చంద్రబాబు బాగా మారిపోయారు. మారిపోయినట్లు కనిపిస్తున్నారు. పదేపదే తాను చేసిన తప్పులన్నిటినీ గుర్తుచేసుకుంటున్నారు. అప్పట్లో తాను అలా చేసి ఉండాల్సింది కాదు అంటూ మనసులోని బాధను పార్టీ నాయకులతో పంచుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో మితిమీరిన అహంకారంతో, పార్టీ నాయకులు వ్యవహరించిన తీరుతో కొన్ని కొన్ని సామాజిక వర్గాలను దూరం చేసుకునేలా చేసింది. తెలుగుదేశం పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నించినా, నాయకుల వ్యవహారశైలి, అవినీతి కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది అని బాబు నమ్ముతున్నారు.  ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అప్పట్లో ప్రవేశపెట్టినా, అవి జనాల్లోకి వెళ్ళకపోవడానికి సొంత పార్టీ నాయకులే కారణమని, ఇవి మరి శృతిమించడంతోనే జనాల్లో పార్టీపై అసంతృప్తి పెరిగిపోయి టిడిపి ఓటమికి దారి తీశాయని చంద్రబాబు కు బాగా అర్థం అయింది.

 ఇప్పుడు పార్టీ నాయకులతో, కార్యకర్తలతో నిర్వహిస్తున్న సమావేశాల్లో గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. పార్టీకి దూరమైన నాయకులను, కొన్ని సామాజిక వర్గాల ప్రజలను దగ్గర చేసుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్లీ తెలుగుదేశం పార్టీతో ఉంటే మీకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తామని చెబుతున్నారు. తప్పు జరిగిందేదో జరిగిపోయింది అని, ఇకపై ఎటువంటి తప్పులు జరుగకుండా చూసుకునే బాధ్యత  నాదే అంటూ భరోసా ఇస్తున్నారు. బాబులో కనిపిస్తున్న ఈ మార్పు చూసి సొంత పార్టీ నాయకులే ఇప్పుడు అవాక్కవుతున్నారు. బాబు బాగా మారిపోయారని నమ్ముతున్నారు.

కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు బాబు ఎంతగా పశ్చాత్తాప పడినా, టిడిపికి దూరమైన ఓటు బ్యాంకు మళ్లీ రావాలంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు. తమ కష్టాలు తీర్చేది ఆ పార్టీనే అని ఇప్పటి వరకు చంద్రబాబు పాలనలో తమకు ఏ మేలు జరగలేదని, కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాము అన్ని విధాలుగా లాభపడ్డారని, తాము వేసిన ఓట్లు వృధా కాలేదని, తమ అభివృద్ధికి జగన్ నిరంతరం పాటుపడుతూ ఉంటే, అది కాదు అనుకుని మళ్ళీ టిడిపి పంచన ఎందుకు చేరాలి అంటూ ఎదురు ప్రశ్నించేవారు ఎక్కువైపోయారు.

చంద్రబాబును పూర్తిగా నమ్మడానికి వీలు లేదని, ఆయన రాజకీయ ఎదుగుదల కోసం మిత్రుడుతో శత్రుత్వం పెట్టుకునేందుకు ప్రయత్నిస్తారని, పూర్తిగా అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు అంటూ బాబు బండారం బయట పెట్టేస్తున్నారు. అసలు ఈ బాబు పై ఈ రకమైన అభిప్రాయాలు కలగడానికి కారణం చంద్రబాబు ఇప్పటి వరకు వ్యవహరించిన తీరే కారణం. ఆయన గతంలో ఎన్నో పార్టీలతో పొత్తు పెట్టుకుని అవసరం తీరాక వారిని పట్టించుకోకుండా వ్యవహరించడం, అలాగే ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా, ఆ డిమాండ్లను నెరవేర్చాలని కోరిన వారిపై కేసులు పెట్టడం వంటి అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: