జూమ్‌..జూమ్‌..డౌట్ : కొంపదీసి.. అది చంద్రబాబు డూప్ కాదు కదా..?

టీడీపీ అధినేత ఇప్పుడు టెక్నాలజీని బాగా వినియోగిస్తున్నారు. అసలు టెక్నాలజీని వినియోగించడంలో చంద్రబాబు రికార్డే రికార్డు. లాక్ డౌన్ వచ్చిన తర్వాత జూమ్ యాప్ ను ఉపయోగించుకుని పార్టీ సమావేశాలు నిర్వహించిన మొట్టమొదటి నాయకుడు బహుశా చంద్రబాబే అయ్యుంటారు. అంతేనా.. ఆయన ఏకంగా మహానాడు వంటి పెద్ద కార్యక్రమం కూడా సింపుల్ గా జూమ్ యాప్ ద్వారానే లాగించేశారు. దటీజ్ బాబు.

అయితే ఇప్పుడు వైసీపీ నాయకులు చంద్రబాబు జూమ్ వాడకంపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. చ‌ంద్రబాబు జూమ్‌ టీవీల్లో మాట్లాడితే ప్రజలు వినే పరిస్థితుల్లో లేర‌ని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడుకు అభ్యంతరమెందుకని ధర్మశ్రీ ప్రశ్నించారు. కొత్త రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వచ్చే విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతో రాజధాని పూర్తవుతుందని... కేవలం 10వేల కోట్ల చొప్పున వెచ్చిస్తే అమరావతి, కర్నూల్‌, విశాఖలో రాజధానుల నిర్మాణం పూర్తవుతుందని ధర్మశ్రీ అన్నారు.

ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులని విశాఖ రాజధానిగా చంద్రబాబు వ్యతిరేకిస్తే ఉద్యమాలు తప్పవని వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబునాయుడు ఎన్ని అడ్డంకులు పెట్టినా విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు ఖాయమన్నారు. టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మితే వారి రాజకీయ సమాధి ఖాయమని ధర్మశ్రీ అంటున్నారు. మరో ఎమ్మెల్యే అదీప్ రాజ్ కూడా చంద్రబాబు జూమ్ సమావేశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అసలు చంద్రబాబు నాయుడు ఉన్నారా.. లేక డూప్‌తో మాట్లాడిస్తున్నారో అర్థం కావడం లేదంటూ పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ ‌రాజ్ సెటైర్లు పేల్చారు. అసలు నాలుగు నెలలుగా చంద్రబాబు అడ్రస్సే లేరని అదీప్‌ రాజ్‌ ఎద్దేవా చేశారు. విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ నిరూపించాలని ఎమ్మెల్యే అదీప్ ‌రాజ్ సవాల్‌ విసిరారు. అమరావతిలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ, పచ్చమీడియా దుష్ప్రచారం చేస్తోందని అదీప్ రాజ్  మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: