హెరాల్డ్ ఎడిటోరియల్: జగన్ గెలిస్తే ?
ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం గందరగోళంలో ఉందన్న విషయంలో సందేహం లేదు. కష్టాల్లో ఉన్న ఏపీని మరింత కష్టాల్లో నెట్టివేస్తూ గత తెలుగుదేశం ప్రభుత్వం అనేక దుబారా ఖర్చులు చేసిన సంగతి తెలిసిందే. దీని కారణంగా ఏపీ ఇప్పటికే లక్షల కోట్ల అప్పుల్లో ఏపీ నిండా మునిగిపోయింది. ఈ దశలో ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జగన్ తన పరిపాలన ద్వారా ఏపీ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలని భావించారు. అంతకంటే ముందుగా తాను పాదయాత్ర సమయంలో చాలా దగ్గరగా చూసిన ప్రజల కష్టాలను తీర్చాలన్న ఉద్దేశంతో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అలాగే అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా జగన్ పరిపాలనపై విస్తృత స్థాయిలో చర్చ కూడా నడుస్తోంది.
జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నిర్ణయాలపై వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేసినా... దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ జగన్ పరిపాలనపై ప్రశంసలు కురవడమే కాకుండా, జగన్ తీసుకున్న నిర్ణయాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో పాటు, తమ రాష్ట్రాల్లో ఏపీలో అమలు చేసిన, పథకాలు, నిర్ణయాలు అమలు చేసే విధంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకుంటూ ఉండడం జగన్ కు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. సంక్షేమ పథకాలు, ప్రజా పరిపాలన అంతా ఒక గాడిలో పడిన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచాలని జగన్ నిర్ణయించుకున్నారు. అసలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వం ఎక్కడా దుబారా ఖర్చులు చేయకుండా జగన్ చొరవ తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే పరిపాలన ఒక గాడిలో పడుతుంది అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా కరోనా వైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించింది.
ముఖ్యంగా ఇప్పటికే ఆర్థిక కష్టాలతో సతమతం అవుతున్న ఏపీ ని అన్ని విధాలుగా కుంగదీసింది.గత నెల 22వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వాన్ని ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో, ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత గందరగోళంలో పడింది. అయితే ఈ ఇబ్బందులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఉన్నవే. ఇక జగన్ ముందుచూపుతో వ్యవహరించే అవకాశం ఉండడంతో ఏపీని ఆర్థికంగా గట్టెక్కించే అవకాశం కనిపిస్తోంది. ఆర్థికంగా ఏపీ మరికొన్ని నెలల్లో పుంజుకునే అవకాశం ఉండడంతో, జగన్ మరింత సమర్థవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందే అవకాశం లేకపోలేదు.
ఎందుకంటే జగన్ ప్రతి విషయంలోనూ ముందుచూపుతో వ్యవహరిస్తూ ఉంటారు. ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టింనా, ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక సమగ్రమైన వివరాలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే జగన్ వాటిని ప్రవేశ పెడతారు. ఇక ఏపీ ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించాలని జగన్ ఇక ముందు ముందు మరింత సమర్ధవంతంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే ఇక జగన్ ఏపీ లో బలమైన నాయకుడుగా మరింత బలోపేతం అవ్వడంతో పాటు, ఆయనను ఢీకొట్టే స్థాయి ఎవరికి ఉండే అవకాశం ఎవరికీ ఉండకపోవచ్చు. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించే నాటికి అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను పాలనా అనుభవం లేని జగన్ ఎలా ముందుకు తీసుకు వెళ్తారనేది చాలామందిలో తలెత్తిన ప్రశ్న.
ఏపీ ముందుకు సాగాలంటే కేంద్రం సహకారం కూడా అవసరం. అలాగే, నిన్నటి దాకా కలిసి ఉన్న తెలంగాణతో పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జగన్ హైదరాబాదులో కేసీఆర్‌తో, ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. ఈ దశలో ఆర్ధిక సంక్షోభం ఎదురయినా, తాను ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకం నిలిచిపోకుండా జగన్ అన్ని జాగ్రత్తలు తీసుంటారనుకోవడంలో సందేహం లేదు. ప్రజా క్షేత్రంలో ఇప్పటికే తానేంటో నిరూపించుకుని తిరుగులేని మెజార్టీ సంపాదించుకున్న జగన్ మరోసారి ఆర్థిక కష్టాల నుంచి ఏపీని బయటపడేసే మరోసారి ప్రజల మనసు గెలుచుకునే అవకాశం లేకపోలేదు.