హెరాల్డ్ సెటైర్ : ఓరి చైనీయుడా... ? మళ్లీ పురుగు పుట్ర నమిలేస్తున్నారా ..?
కుక్క తోక వంకర అనే సామెతకు సరైన అర్ధం ఎలా ఉంటుందో ఓ సారి చైనా జనాలను చూపిస్తే సరిపోతుంది. అసలు ఆళ్ళకి మెడ మీద తలకాయ ఉందా అనేది డౌటే..! ఎందుకంటే అసలు ప్రపంచనైకి కరోనా అనే వైరస్ పురుగుల్ని వదిలి అతలాకుతలం చేయడమే కాకుండా లక్షలాదిమందికి పొట్టన పెట్టుకుంది ఈ చైనానే. కాదు కాదు చైనా జనాలు తినే అడ్డమైన జంతుజాలం అనేది కొంతమంది మేధావుల రీసెర్చ్ లో తేలిపోయింది. అసలు గబ్బిలం పేరు చెబితే చాలు ఛీ ఛీ అనుకుంటారు. అటువంటిది ఆల్లేమో సూపు చేసుకుని మరీ తాగేస్తున్నారు. ఓరి మీ తిండి తగలెయ్య ఇవేం తిండి రా బాబు అన్నా అల్లు మాత్రం మారనంటే మారం అంటూ, తేళ్లు, పాములు, ఇలా అన్నింటీని నమిలిపడేస్తున్నారు. ఏ దేశమోళ్లకి లేనటువంటి వింత వింత ఆహారపు అలవాట్లన్నీ చైనీయులకే ఉంటాయి. నేల మీద, నీటిమీద, ఆకాశంలో ఇలా ఎక్కడ ఏ జీవి కనిపించినా చైనీయుల నోట్లో పడాల్సిందే.
పిల్లి, బల్లి, నల్లి అనే బేధం లేకుండా చైనీయులకు ఆహారం అయిపోతూ ఉంటాయి. చైనీయుల ఆహారపు అలవాట్లు మిగతా దేశాల ప్రజలకు వికారం కలిగిస్తూ ఉంటాయి. కొద్ది నెలల క్రితం చైనాలో పుట్టి పెరిగిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని విలవిలలాడుతోంది వేలాదిమంది బలయ్యారు. లక్షలాదిమంది కి ఇది అంటుకుని కుయ్యో మొర్రో అంటున్నారు. అసలెందుకు ఆ చైనాలోనే పుట్టిన కరోనా కు అక్కడి జనాలు బలయ్యారు. ఇంకెంతమంది బలవుతారో అని బెంగెట్టేసుకున్న అక్కడి ప్రభుత్వం ఓరి బాబు అడ్డమైన జంతువుని తిందాం అంటే ఇక పై కుదరదు.. రులెట్టేసాం అని చెప్పేసింది. అసలు చైనా పెబుత్వం రూలెట్టడానికి కారణం లేకపోలేదు.
పెపెంచా దేశాలన్నీ ఒరేయ్ మీరు తినే ఆ పురుగు పుట్రా వల్లేరా నాయన ఈ కొత్త జబ్బు అంటూ తిట్టిపోయడంతో ఆహా అలాగా అంటూ మొన్నటి వరకు అన్ని రకాల జంతువులను తినడం ఆపండ్రా అంటూ ఆర్డర్స్ ఇచ్చేసారు. ఇప్పుడు ఏమో చైనాలో కరోనా వైరస్ మొత్తం తగ్గిపోయింది. కానీ పెపంచం అంతా విస్తరించిపోయి అల్లాడుతోంది. ఎక్కడో ఎవడికో ఏదో అయితే మాకేంటి అంటూ మళ్లీ తినడం మొదలు పెట్టండిరా అంటూ గేట్లెత్తేసింది. దీంతో మళ్లీ పాత సీన్ రిపీట్. మళ్లీ మార్కెట్ లో అన్నీవేలాడుతున్నాయి. అసలు అడ్డమైన తిండి తినడానికి గేట్లు ఎత్తేసారు కదా ..! అసలు అక్కడ వాతావరణం ఎలా ఉందొ చూసొద్దామంటూ డెయిలీ మెయిల్ రిపోర్టర్ ఒకరు లాక్ డౌన్ నిబంధనలు సడలించిన గులిన్ , డొంగువాన్ మరికొన్ని ప్రాంతాల్లో అసలు ఏమి జరుగుతోంది అంటూ వెళ్లి చూస్తే పాత చైనా మార్కెట్లు ఎలా ఉన్నాయో మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది.
ఒరేయ్ బాబు మీకు అర్ధం కావడం లేదా ..? అసలు ఇలా అడ్డమైన జంతువులను నమిలిపారెయ్యడం వల్లే కదరా ..? మళ్లీ ఏంట్రా బాబు ఇది అంటే ..? చాలా రోజులయ్యింది కదా తింటే తప్పేంటి ? అయినా మా దేశంలో కరోనా లేదు కదా అంటూ ఎలాడుతున్న మాంసం వైపు ఆశగా చూస్తూ చెబుతున్నారట. ఇలా ఆరా తీస్తున్న ఆ రిపోర్టర్ ను కొంతమంది అధికారులు ఆపి నీకు ఇక్కడ పనేంటి దేని గురించి నువ్వు ఆరా తీస్తున్నావ్ అంటూ గట్టిగానే నిలదీశారట. అసలు చైనా జనల వింత ఆహార అలవాట్ల గురించి పెపంచానికి ఈ మీడియానే చెప్పి చైనా పరువు తీసిపడేసింది అన్నది అక్కడి ప్రభుత్వ బాధ. అసలు చైనాలో విదేశీ సోషల్ మీడియాలు ఏవీ పనిచేయవు.
కేవలం ఆ దేశం కోసం సొంతంగా ఒక సోషల్ మీడియా ప్లేట్ ఫామ్ ఉంది. ఇక అందులో అందరూ చైనా జనాలే ఉంటారు. అందుకే అందులో ఈ మీడియా వల్లే మన పరువు తీస్తున్నారు. అసలు కరోనా మనది కాదు..! ఆ ఇటలీ వోడు, అమెరికా వోడు మన దేశం మీద కుట్ర పన్ని ఆ వైరస్ ను మన దేశంలోకి డంప్ చేశారు. మీరు మీకు నచ్చిన నల్లని, బల్లిని తినెయ్యండి అంటూ చెప్పేస్తున్నారు. ఇక చెప్పేదేముంది మళ్లీ ఏదో కొత్త వైరస్ పుట్టించే వరకు ఈ చినవోళ్ళు నిద్రపోరు కదా !