హెరాల్డ్ సెటైర్: వామ్మో '23 ' వణుకొచ్చేస్తోందయ్యో ..?

కొందరికి కొన్ని భయాలు ఉంటాయి. కానీ ఎవరికీ లేని తారీకు భయం ఆ తెలుగుదేశం వాళ్లందరికీ పట్టేసుకుంది. ఏంటో తెలియదు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన 23 సీట్లు. అమరావతి, ఇడ్లీ పాత్రి, ఈఫిల్ టవర్ ఇలా ఎన్నో గ్రాఫిక్స్ డిజైన్లు చూపించి, అసలు ఆ కంపెనీ ఎక్కడ ఉందో ..? అది ఏం చేస్తుందో తెలియని కంపెనీలన్నీ బా....బు గారు అంటూ పరుగెత్తుకొచ్చేసి మేము మీ అమరావతిలోనే పెట్టుబడులు పెడతాం... మాకు లాభం వచ్చినా నష్టం వచ్చినా ఫర్వాలేదు మిమ్మల్ని ఆ అమరావతి సింహాసనం మీద కూర్చుని నీరో చక్రవారాహిళా ఫిడేలు వాయించండి సార్ మాకు ఇంకేమి వద్దు అంటూ వందల కంపెనీలు క్యూ కట్టేసి కాగితాల్లో ఏపీలో పరిశ్రమలు స్థాపించేసాయి. ఇంకేముంది పొలోమంటూ జనాలు సైకిల్ కి గుద్దేస్తారని పగటి కలలు కంటే జనాలేమో నిజంగానే సైకిల్ ని ఓ గుద్దు గుద్ది మూలాన కూర్చోబెట్టేసారు. 

 

ఎన్నికల ఫలితాలు వచ్చింది 23 వ తారీకు, వచ్చిన సీట్లు 23 వ తారీకు. అంతెందుకు టీడీపీ  ప్రభుత్వ హయాంలో వైసీపీ వాళ్ళు గెలిపించుకున్న వారిని అక్రమంగా లాక్కొచ్చి పార్టీలో చేర్చుకున్న వారు 23 . వారి నాయనో ఈ 23 గోలేంట్రా బాబు అని ముక్కుతూ మూలుగుతూ ఉంటే ఇప్పుడు ఆ జగన్ కనీసం మానవత్వం కూడా లేకుండా మూలిగే నక్క మీద తాటిపండు వేసినట్టుగా మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలను కూడా మళ్లీ 23 వ తేదీన పెట్టడమేంట్రా బాబు అనుకుంటూ బాబు ఆయన బ్యాచ్ ఇప్పుడు ముక్కుతూ మూలుగుతూ ఆ 23 న జరిగే ఎన్నికలను తలచుకుని వణికిపోతున్నారట.  

 

ఆ జగన్ కక్ష గట్టి మరీ 23 డేట్ ను హైలెట్ చేసుకుంటూ పార్టీని బయపెట్టేస్తుండడం బాబు గారికి అస్సలు నచ్చడంలేదు. పోనీ ఈ స్థానిక పోరులో అయినా గట్టిగా ఫలితాలు సాధించి ఇదిగో జగన్ నిన్ను జనాలు ఛీ కొడుతున్నారు చూడవయ్యా అందమా అంటే ఆ జనాలు మళ్లీ ఆ జగన్ కే జై జైలు కొట్టేస్తున్నారు. ఒక పక్క పార్టీలో జనాలు అధికార పార్టీలోకి వెళ్లిపోతున్నా జగన్ హవాను అడ్డుకోలేక సతమతం అయిపోతున్నా బాబు గారు ఆయన సుకుమారుడు మళ్లీ అవే అవే పాత చింతకాయ ఫార్ములాలనే ఉపయోగించేస్తున్నారు. 
మళ్లీ 23 న జరిగే ఎన్నికల్లో జనాలు ఛీకొట్టేలా ఉన్నట్టు తేలిపోవడంతో అసలు ఎన్నికల్లో పోటీ చేయకపోతే పోలా అన్నట్టుగా బాబు గారు ఉన్నారట. 


మరి ఉండరేంటి 23 షాక్ అలాంటిది. అన్నట్టు సినబాబు గారు కూడా పుట్టింది 23 కాబట్టి ఈ 23 టీడీపీకి కలిసి రావడంలేదు అని ఆళ్లూ ... ఈళ్ళు చెవులు గట్రా కొరికేసుకుంటున్నారు. అసలు క్యాలెండ్రిలో 23 తేదీ ని తొలిగించేలా ఉద్యమం ఈ టీడీపీ మేధావులంతా కలిసి చేపడతారా అనే సందేహాలు ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చేస్తున్నాయి. చూద్దాం ఆ ఉద్యమం కూడా వచ్చినా రావచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: