గవర్నమెంట్ ఉద్యోగులకి సెలవుల షాక్ ఇచ్చిన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు 

Manasa Karnati

 

ఈ కాలంలో ఎంత వర్క్ హాలిక్ అయినా, కమిట్ మెంట్ తో పని చేసే వారైనా,సెలవు వస్తుందంటే చాలు.. ఆ రిలీఫ్ చాల హాయిగా ఉంటుంది. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ప్రతి ఒకరు కూడా వచ్చే సెలవుల మీద ఆసక్తి ఎక్కువ చూపుతారు. దీనికి తోడు లాంగ్ వీకెండ్, లాంగ్ లాంగ్ వీకెండ్లు వస్తున్నాయంటూ అందుకు తగ్గట్లు టూర్లు ప్లాన్లు చేసుకునే ట్రెండ్ ఇప్పటికే చాల వరకు మొదలైంది.

 

వచ్చే క్యాలెండరు ఏడాదికి చెందిన సెలవుల్ని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జారీ చేశాయి. కొన్ని సెలవులు తప్పించి మిగిలిన అన్ని సెలవులు కామన్ గానే ఉంటాయి. వచ్చే ఏడాదికి సంబంధించిన సెలవుల విషయానికి వస్తే.. ఈసారి అందరికి నీరసం కలిగించే పరిస్థితి వచ్చింది.

 

ఎందుకంటే సాధారణ సెలవుల్లో ఎక్కువ శనివారలు, ఆదివారాలే వస్తున్న పరిస్థితి. పలుశాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఐటీ ఉద్యోగులకు సైతం శని.. ఆదివారాల్లో సెలవులు ఉండే విషయం మన అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సెలవుల్లో అత్యధికం శనివారలు ఆదివారాలు రావటంతో నీరసం వచ్చే పరిస్థితి. సెలవుల లెక్క చూస్తే సాధారణ సెలవులు 28 కాగా.. ఐచ్ఛిక సెలవులు 20గా లెక్క తేల్చారు ప్రభుత్వ వర్గాలు.

 

సాధారణ సెలవుల్లో బక్రీద్,ఆగస్టు 15, వినాయకచవితి, బతుకమ్మ, దుర్గాష్టమి, బాక్సింగ్ డే {{RelevantDataTitle}}