సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు?

Purushottham Vinay
నిరుద్యోగులకు శుభవార్త. చాలా మందికి కూడా బ్యాంక్ ఉద్యోగాలు చెయ్యాలనే కల ఉంటుంది. అందుకోసం ఎప్పటినుంచో ఎంతో కష్టపడుతూ ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారికి శుభవార్త.ఇక సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ని రిలీజ్ చేసింది. ముంబయి కేంద్రంగా పనిచేసే సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ విభాగంలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది.ఇక దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచ్‌ల్లోని చీఫ్ మేనేజర్లు ఇంకా అలాగే సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. విడుదల చేసిన పోస్టుల్లో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఇంకా ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఇక భర్తీ చేయనున్న ఖాళీలు అలాగే అర్హతల విషయానికి వస్తే..విడుదల అయిన నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు.


ఇక వీటిలో చీఫ్ మేనేజర్ స్కేల్-4 (మెయిన్ స్ట్రీమ్) (50) ఇంకా అలాగే సీనియర్ మేనేజర్ స్కేల్-3 (మెయిన్ స్ట్రీమ్) (200) ఖాళీలు ఉన్నాయి.ఇక పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖచ్చితంగా ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇంకా అలాగే  సంబంధిత విభాగంలో ఖచ్చితంగా అనుభవం ఉండాలి.ఇక చీఫ్‌ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 31-12-2022 నాటికి 40 ఏళ్లు అలాగే సీనియర్ మేనేజర్ పోస్టులకు మొత్తం 35 ఏళ్ల వయస్సు మించకూడదు.కాబట్టి ఈ పోస్టులు అప్లై చేసుకోడానికి ఆసక్తి ఇంకా అలాగే అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.ఇక ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు 11-02-2023ని చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ పోస్టులకు ఆసక్తి ఇంకా అర్హతలు కలిగిన నిరుద్యోగులు ఖచ్చితంగా అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: