ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు..?

Purushottham Vinay
ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ ఇంకా అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ని రిలీజ్ చేసింది. ఇక ఈ రిక్రూట్‌మెంట్ నుండి మొత్తం 1,675 పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా IB అధికారిక వెబ్‌సైట్ mha.gov.inలేదా ncs.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది జనవరి 28న స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 17 వ తేదీన పూర్తి అవుతుంది. ఫస్ట్ అప్లికేషన్లను జనవరి 21 వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయని ప్రకటించినా.. దానిని వాయిదా వేస్తున్నట్లు ఐబీ నోటీస్ ని జారీ చేసింది. అలాగే దీంతో పాటు.. వయస్సు కట్ ఆఫ్ తేదీని కూడా మొదట 17.02.2023గా పేర్కొనగా..దానిని 10.02.2023కు తగ్గించారు.


ఇంకా ఈ పోస్టుల ఖాళీల వివరాల విషయానికి వస్తే..
మొత్తం పోస్ట్‌లు - 1,675 వున్నాయి.
సెక్యూరిటీ అసిస్టెంట్ - 1525 పోస్టులు వున్నాయి.
MTS - 150 పోస్టులు వున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో 07 ఇంకా హైదరాబాద్ లో మొత్తం 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ముఖ్యమైన తేదీల విషయానికి వస్తే..
ఆన్‌లైన్ అప్లికేషన్ తేదీ - 28 జనవరి 2023
అప్లై చేయడానికి చివరి తేదీ - 17 ఫిబ్రవరి 2023

ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారి అర్హతల విషయానికి వస్తే..

ఈ పోస్టులకు కనీస విద్యార్హత 10వ తరగతి ఉండాలి. అభ్యర్థుల పరిమితి MTSకి 18-25 సంవత్సరాలు ఉండాలి. అలాగే SA/EXE పోస్టులకు 27 సంవత్సరాలు ఉండాలి. ఇక రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు అయితే వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇంకా ఈ వయోపరిమితిని నిర్ణయించడానికి కటాఫ్ తేదీ అప్లికేషన్ కి చివరి తేదీ ఫిబ్రవరి 17.ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.50 చెల్లించాలి. ఇంకా అలాగే దీనితో పాటు రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఫీజుగా మొత్తం 450 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

ఇక ఈ రిక్రూట్‌మెంట్‌కు సెలెక్ట్ కావడానికి అభ్యర్థులు టైర్ 1, టైర్ 2 పరీక్షలను రాయాలి. టైర్ 1 పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. ఇక టైర్ 2 పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది.సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు లెవల్ 3 ప్రకారం  రూ.69,010 వరకు చెల్లించబడుతుంది. అలాగే ఎంటీఎస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.18 వేల నుంచి రూ.56,900 చెల్లిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: