యుద్ధం ముసుగులో రష్యాను చైనా మోసం చేస్తోందా?

నమ్మిన వాళ్లనే ఎక్కువగా మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ అవకాశం రష్యా విషయంలో చైనా తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. రష్యాతో ఉంటున్నాను అంటూనే ఒక పక్కన చైనా యూ ఎస్ ఎస్ ఆర్ లో పార్ట్ అయినటువంటి కొన్ని దేశాలను తన గ్రిప్ లోకి తెచ్చుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అవి కజికిస్తాన్, టజకిస్తాన్, గిలిగిస్తాన్‌‌ లాంటి ఐదు దేశాలు.

ఇప్పుడు చైనా ఎంత అధికారాన్ని ప్రదర్శిస్తుంది అంటే ఆ ఐదు దేశాలైనటువంటి కజికిస్తాన్ లాంటి ఐదు దేశాల అధ్యక్షులు ఇప్పుడు చైనా మంత్రి జింపింగ్ తో యువర్ హైనస్ అంటూ మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. జింపింగ్ వీళ్ళని మిస్టర్ అంటూ పిలుస్తుంటే వీళ్ళు మాత్రం సామంత రాజులు చక్రవర్తి తో మాట్లాడినట్లుగా యువర్ హైనస్ అంటూ మాట్లాడుతున్నారట. ఇదివరకు ఈ  దేశాలు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఇలా మాట్లాడేవని తెలుస్తుంది.

ఇప్పుడు రష్యా తమని ఆదుకోలేదని తెలిసింది ఆ దేశాలకు. వాటి అవసరాలు రష్యా తీర్చలేదని తెలిసిన తర్వాత చైనా ఇప్పుడు ఆ దేశాలను తన వైపుకు తిప్పేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఒక వైపున రష్యాలో ఉన్న భూభాగం తనదని క్లైమ్ చేస్తుంది చైనా.  చైనా రష్యా దగ్గర నుండి ఆయుధాలు కొంటుంది. రష్యా మాత్రం ఆయుధాలను పార్ట్స్ గా అమ్ముతుంది. ఆ పార్ట్స్ ను కూడా ఎక్కువ ధరలకు అమ్ముతుంది రష్యా.  

అలా చైనా నుండి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్న రష్యా ఇప్పుడు చైనా వలలో పడిందని తెలుస్తుంది. గతంలో రష్యా చైనాని చిన్నచూపు చూసేది. ఇప్పుడు పరిస్థితి తలక్రిందులు అయ్యింది. అందుకే ఇప్పుడు చైనా రష్యాని చిన్నచూపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. కానీ ఈ మార్పులో అవసరమైంది మాత్రం సహనం, నిరీక్షణ, పట్టుదల. ఎవరి రోజు వాళ్ళకి వస్తుంది. అప్పటివరకు అవతల వాళ్ళకి ఆడింది ఆటగా పాడింది పాటగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: