టీచర్లకు గుడ్‌న్యూస్‌లు చెబుతున్న జగన్‌?

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయులకు సంబంధించి దాదాపు 100 రకాల డిమాండ్లు ఉంటాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగులను సంతృప్తి పరిచే విధంగా ప్రభుత్వం  చర్యలు తీసుకుంటోంది. మొన్నటి వరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, ఆర్డీవోల బదిలీ, పోలీసు అధికారుల బదిలీ, ఇలా అందరినీ బదిలీ చేశారు. ఇప్పుడు ఉపాధ్యాయుల వంతు వచ్చింది.

ముఖ్యంగా ఉపాధ్యాయులు బదిలీలపై సీఎం జగన్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి బదిలీలు కోరుకుంటున్న ఉపాధ్యాయులు తీపి కబురుతో ఆనందంగా ఉన్నారు. సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే చాలా దూరంలోని గ్రామీణ ప్రాంతాలకు టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కొన్ని స్కూళ్లకు ఎక్కువ మంది టీచర్లు వచ్చి, కొన్ని ప్రాంతాల్లో టీచర్లు లేకపోతే చాలా కష్టం.  

ఉన్న స్కూళ్లలోనే ఎక్కువ మంది ఉంటూ మిగతా స్కూళ్లలో తక్కువ మంది ఉంటే తీవ్ర సమస్య ఏర్పడుతుంది. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది. దాని వల్ల వారి చదువు దెబ్బతింటుంది. అన్ని సబ్జెక్టుల కు సంబంధించిన టీచర్లు అందుబాటులో ఉండేలా చూడాలి. కేవలం ఉపాధ్యాయుల సంతృప్తి  కోసం బదిలీలు ఇష్టారీతిన చేస్తే చివరకు విద్యార్థులు నష్టపోతారు. ప్రతి సబ్జెక్టు బోధించే టీచర్ అందుబాటులో ఉండాలి. ఆ స్కూల్ లో విద్యార్థుల సంఖ్య పెరగడానికి రిజల్ట్ వంద శాతం రావడానికి అది ఉపయోగపడుతుంది.

నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో ఈ ఏడాది మంచి రిజల్ట్ వచ్చింది. దాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. తద్వారా ఆ రిజల్ట్ ను మరింత మెరుగు పరచాలంటే సరైన బోధన అవసరం. అన్ని సబ్జెక్టులు బోధించే టీచర్లు అవసరం. కాబట్టి కార్పొరేట్ కంటే దీటుగా చేస్తున్న ప్రభుత్వ స్కూళ్లలో టీచింగ్ మరింత మెరుగు పడేలా చర్యలు తీసుకోవాలి. ఎక్కడెక్కడ ఉపాధ్యాయులు అవసరం అవుతారో, ఎక్కడ ఖాళీలు ఉన్నాయో గుర్తించి ఆయా ప్రాంతాల్లో నియమించేలా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: