ఏపీ బీజేపీ.. జగన్‌తో ఇలాగైతే కష్టమే?

భారతీయ జనతా పార్టీ ఎంతో చరిత్ర కలిగిన పార్టీ. మరి అలాంటి పార్టీకి సంబంధించిన క్యాడర్ జాతి స్థాయిలోదైనా, రాష్ట్రీయ స్థాయిలోదైనా ఎలా ఉండాలి.‌ ఎన్ని పార్టీలు ఎదురు వచ్చినా ఏ పార్టీలు వేటితో కలిసి వచ్చినా ఒంగిపోకూడదు, లొంగిపోకూడదు. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్రీయ క్యాడర్ మాత్రం ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని కోల్పోతున్నట్లుగా తెలుస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు.

ఇప్పుడు ఆత్మవిశ్వాసంగా, ఆత్మగౌరవంతో నిలబడాల్సిన భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ నాయకత్వం ఇప్పుడు ఎందుకు అవేవీ పట్టించుకోవడం లేదో తెలియడం లేదని అంటున్నారు. కర్ణాటకలో ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ తమ ఇలాంటి పద్ధతితోనే ఓడిపోయింది అన్నట్లుగా తెలుస్తుంది. ఏ సమస్య వచ్చినా దేనిపై ఒక మాట మాట్లాడాలన్నా బిజెపి యొక్క రాష్ట్ర నాయకత్వాలు కేంద్రం వైపుగా చూస్తుంటాయని తెలుస్తుంది.

ప్రతి దానికి కేంద్ర నాయకత్వం చేయాలి. కేంద్ర నాయకత్వం చెప్పాలి అన్నట్లుగా అవి ప్రవర్తిస్తాయని అంటున్నారు. కేంద్రం నుండి సమాచారాన్ని తీసుకోవడంలో తప్పులేదు. కానీ వాళ్లకి రాష్ట్ర నాయకత్వాలు ఇచ్చినప్పుడు వాళ్లు కూడా సొంతంగా ఆలోచించి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఆ విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పదేపదే భారతీయ జనతా పార్టీతో కూటమిగా ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు.

కానీ బిజెపికి తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళటం ఇష్టం లేనట్లుగా తెలుస్తుంది. అలాంటప్పుడు ఆ విషయాన్ని ఈ రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది.  కానీ అప్పటివరకు గంభీరమైన ప్రసంగాలు ఇస్తారు. కానీ ఇప్పుడు ఈ విషయం వచ్చేసరికి మాత్రం కేంద్రం చూసుకుంటుంది అనుకుంటారో ఏమో దాని పై ధైర్యంగా మాట్లాడరు. ఎలక్షన్లు దగ్గర పడుతూ ఉండడంతో ఇప్పటికైనా వాళ్ళు తమ ఉద్దేశాన్ని ఓపెన్ గా చెప్పాలి. తెలుగుదేశం ఇంకా జనసేనతో కలిసి వెళ్లాలనుకుంటే ఓకే చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి. కర్ణాటకలో ఇది లోపించడం వల్లే ఓడిపోయారని అంటున్నారు ఆ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: