ఇంట్రస్టింగ్‌: జగన్‌ ముందస్తుకు ఖాయంగా వెళ్తారా?

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు 2023 లోనే జరుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్ల గురించి కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. ఆంధ్ర ఎలక్షన్స్ కు సంబంధించి, ముందస్తు ఎన్నికల గురించి ఈ ప్రచారం జరుగుతుందని తెలుస్తుంది. ఆంధ్రాకు సంబంధించిన ఇటీవల ఒక డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి కారణమైనట్లుగా తెలుస్తుంది.

జగన్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఆయన ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించారు. ఒకరిని ఎస్సీ నుండి, ఒకరిని ఎస్టి నుండి, ఒకరిని బిసి నుండి ఒకర్ని కాపుల నుండి ఇలా ఐదుగురిని నియమించారు. ఆ డిప్యూటీ సీఎం లలో ఒకయిన రాజన్న దొర చేసిన వ్యాఖ్యలను మరోరకంగా అర్థం చేసుకున్నారు జనాలు. డిసెంబర్, జనవరిలలో ఎలక్షన్లకు సంబంధించిన అనౌన్స్మెంట్ జరుగుతుంది. అయితే దీన్నే జనాలు ఆంధ్రాలో డిసెంబర్ లో ఎలక్షన్స్ జరుగుతాయట అని అనుకుంటున్నారు.

కానీ ఆయన చెప్పింది డిసెంబర్లో అనౌన్స్ చేసే ఎన్నికల షెడ్యూల్ గురించి అని తెలుస్తుంది. అసలు డిసెంబర్లో ఆంధ్ర ఎలక్షన్స్ అంటే సెప్టెంబర్ కల్లా ఎన్నికల షెడ్యూల్ ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా తెలంగాణతో సమానంగా ఎన్నికల ప్రచారం షెడ్యూల్ విడుదల చేయవలసి ఉంటుంది. కానీ ఆయన చెప్పింది ఏంటంటే 2019 ఎన్నికల సమయంలో ఇలాగే 2018 డిసెంబర్ లోనే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేశారని ఆయన అన్నారు.

అలా ఆంధ్ర ఎలక్షన్లకు సంబంధించి డిసెంబర్లో ఎన్నికల షెడ్యూల్ చేస్తే ఆ తర్వాత వచ్చే సంవత్సరం 2024ఏప్రిల్ లోగా ఎలక్షన్లను ముగించేసే అవకాశం ఉంటుంది అని తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ జనవరి, ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసినా ఏప్రిల్ కల్లా ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేస్తారని తెలుస్తుంది. అదేవిధంగా మేలో కౌంటింగ్ జరుగుతుందని ఫలితాలు వెల్లడవుతాయని కూడా అంటున్నారు. ఇక పోతే వచ్చే సంవత్సరం జూన్ కి వచ్చేసరికి ఆంధ్రాలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: