ఇండియా సేవాగుణానికి థ్యాంక్స్ చెప్పిన చైనా?

భారతదేశంపై శత్రుత్వం వహించే వాళ్ళని కూడా భారత్ అత్యవసర సమయాల్లో ఆదుకుంటుందని మరోసారి రుజువైంది. మన భారతీయులు యొక్క సేవాగుణం మరోసారి తేటతెల్లమైంది. ప్రపంచానికి తెలిసింది. తాజాగా చైనా‌ భారత్ సైన్యాన్ని ఒక విషయంలో సహాయం చేయమని అడిగిందట.  అడిగింది కదా అని భారత్ వెంటనే అడిగింది ఎవరనేది కూడా చూడకుండా సహాయం చేసిందట.  

ఇంతకీ విషయం ఏమిటంటే చైనాకు సంబంధించిన ఒక షిప్ ఇండియన్ ఓషన్లో మునిగిపోతూ ఉంటే దానిలో ఉన్న తమ వాళ్ళని కాపాడమని చైనా పక్కన ఉన్న దేశాలు అన్నిటిని అడిగిందట. అలాగే భారత్ ను కూడా అడిగిందట. కానీ భారత్ నేవీ దళం చైనా అభ్యర్థనకు వెంటనే సమ్మతించి రంగంలోకి దిగి వాళ్లకు సహాయం చేశారట. చైనాకు సంబంధించిన ఒక ఫిషింగ్ షిప్ 38 మంది ప్రయాణికులతో ఇండియన్ ఓషన్లో మునిగిపోయిందట.‌

అప్పుడు భారత్ సహాయం కోసం అడగగానే భారత నేవీ కి సంబంధించిన పి 81 మేరీ టైం పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ రంగంలోకి దిగింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ భారీగా సెర్చింగ్ చేసి నలుగురిని కాపాడిందట. అక్కడి క్లైమేట్ కండిషన్స్ లో కూడా భారత్ చైనాతో కలిసి ఈ సెర్చింగ్ లో పాల్గొందట.‌ కానీ చైనా నే కదా అడిగింది దానికి సహాయం చేయవలసిన అవసరం ఏముంది అని అడిగే ఉధ్దేశంలో కాక, సమస్య వచ్చిన వాళ్ళకి సహాయం చేయాలి అనే భారత్ యొక్క దృక్పథం ప్రకారం భారత నేవీ వాళ్లకు సహాయం చేసిందట.

వాస్తవానికి చైనా ఈ ఫిషింగ్ బోట్ల పేరుతో ఆ ఇండియన్ ఓషన్ సరిహద్దుల్లో తీర ప్రాంతాల్లో నిఘాలు పెడుతూ ఉంటుందట.‌ అయినా సరే భారతదేశం అన్నీ తెలిసినా అవి ఏమీ పట్టించుకోకుండా చైనా ప్రయాణికులు ఆపదలో ఉన్నప్పుడు కాపాడింది అన్నట్లుగా తెలుస్తుంది.‌ చివరిగా తమ వాళ్ళని కాపాడినందుకు చైనా ప్రభుత్వం భారత సైన్యానికి ధన్యవాదాలు చెప్పిందట చాలాకాలం తర్వాత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: