పాక్‌ను గాలికొదిలేస్తున్న సంపన్న ముస్లిం దేశాలు?

పాకిస్తాన్ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ పెట్రోల్ డీజిల్ మందులు ఏవి కొనాలన్నా  విదేశీ మారకద్రవ్య నిధులు అవసరం. కానీ అవి అడుగంటి పోయాయి.  పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇలాంటి సందర్భంలో వివిధ దేశాలను అప్పులు ఇవ్వమని సాయం అడుగుతోంది. దీనికి ఆ దేశాలు సరిగ్గా స్పందించడం లేదు.  దుబాయ్, ఖతర్ లాంటి దేశాలు  అప్పు పై షూరిటీ ఇచ్చేందుకు ముందుకు వచ్చి వెనక్కి తగ్గాయి.

ప్రస్తుతం ఆయా దేశాలు ముఖం చాటేస్తున్న వైనం కనిపిస్తోంది. కాబట్టి పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఐ ఎం ఎఫ్‌ రెండున్నర బిలియన్ డాలర్ల అప్పు ఇచ్చింది. ఇంకా రెండున్నర బిలియన్ డాలర్ల అప్పు ఇవ్వాలని పాకిస్తాన్ ఐఎంఎఫ్ ను అడిగింది కానీ ఐఎంఎఫ్‌ పాకిస్తాన్ అడిగిన అప్పు తిరస్కరించింది. చైనాను పాకిస్తాన్ షూరిటీ అడిగింది కానీ అది ఇవ్వలేదు. ఇప్పటికే పాకిస్తాన్ కు  చైనా 30 బిలియన్ డాలర్ల అప్పును ఇచ్చింది. దాన్ని ఇంకా తీర్చడం లేదు. మళ్ళీ అప్పు కావాలని అడుగుతుంది. షూరిటీ పెట్టమని చైనాను ప్రాధేయపడుతోంది.

సబ్సిడీ లేకుండా ఐఎంఎఫ్ లోన్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అయితే పెట్రోల్ డీజిల్ అమ్మిన వెంటనే తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. పెట్రోలియం సంస్థలకు గాని వివిధ సంస్థలకు వెంటనే డబ్బులు ఇవ్వాల్సిందే. ఇందులో రాయితీ ఉండదు అవి కూడా కష్టమవుతుంది.

సబ్సిడీ లేకుండా కరెంటును వివిధ దేశాల నుంచి కొని దానిని ప్రజలకు అందివ్వాలి. మళ్లీ ఆ డబ్బులను ఆయా సంస్థలకు తిరిగి చెల్లించాలి. సబ్సిడీ ఉంటే కాస్త అయినా ఊరట లభించేది.  కానీ సబ్సిడీ లేకపోవడంతో పార్కు ఏం చేయాలో తోచడం లేదు. ఇప్పటికే అమెరికా రెండు బిలియన్ డాలర్ల అప్పును పాకిస్తాన్ కు ఇప్పించింది. మరింత అప్పు కోసం చైనా ఎదుట పాకిస్తాన్  సాగిలబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: