టీడీపీ, బీజేపీ పొత్తు కోసం పత్రికాధిపతి ప్రయత్నాలు?

ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ ఇప్పుడు బిజెపి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. బిజెపి వాళ్ళను ఇటు తెలుగుదేశం వైపుకు వచ్చే విధంగా చేస్తున్నారన్నట్లుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోండి. దాంతో పొత్తు పెట్టుకోకపోతే మీరు ముందుకు వెళ్లలేరు అంటూ ఆయన చెబుతున్నట్లుగా తెలుస్తుంది. ఒకరకంగా వాళ్ళని హిప్నోటైజ్ చేస్తున్నారట ఆయన.

బిజెపి సీనియర్ నాయకులతో మీరైనా చెప్పండయ్యా, మీరైనా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం గురించి మాట్లాడండి అని అంటున్నారట. మొన్న కర్ణాటక ఎలక్షన్లలో చూశారు కదా బీజేపీ ఓటమి, బీజేపీ ఫలితం. రేపు తెలంగాణలో కూడా ఓడిపోతే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఇక చివరికి వచ్చేసరికి ఆంధ్రలో పరిస్థితి కూడా అర్థం చేసుకోండి అంటూ చెబుతున్నారని తెలుస్తుంది.

తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తే వాళ్ళు ఏవో కొన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఒంటరిగా పోటీ చేసి ఓడిపోతే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి అని అంటున్నారట.  ఓడిపోతే మీరు తిరిగి కార్యకర్తలైపోతారు అదే తెలుగుదేశం తో ఉంటే ఏవైనా కొన్ని పొజిషన్స్ అయినా వస్తాయన్నట్లుగా అంటున్నారట. ఇక ఆయన తన పత్రికలో కన్నడ ఫలితంతో వాడిన కమలం అని వార్తలు వ్రాసుకోచ్చారట. ఆ తర్వాత వ్యూహం మార్చకపోతే కనుమరుగే, పొత్తులతో బలపడడానికి ప్రయత్నించాలి సీనియర్ కార్యకర్తల మనోగతం అని వ్రాశారని తెలుస్తుంది.

అయితే ఈ వార్తలపై కొంతమంది ఆయనను కొన్ని విషయాలు అడుగాలనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అవి ఏమిటంటే 2014లో పొత్తు పెట్టుకున్నారు కదా అప్పుడు ఏమైంది అని అడుగుతున్నారు. అలాగే 2008లో పొత్తు లేకుండా గెలిచిన బిజెపి 2009లో టిడిపి తోనే కదా పొత్తు పెట్టుకుంది అప్పుడు ఏమైంది, ఇంకో విషయం ఏమిటంటే పొత్తు పెట్టుకున్న ప్రతిసారి ఎవరు గెలుస్తున్నారు, బీజేపీనా లేదంటే టిడిపినా అని అడుగుతున్నారు.  పక్క వాళ్ళ సమాధులపై తమ పునాదులు వేసుకోవాలి అనుకోవడం తప్పని వాళ్లు అంటున్నారు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: