కర్ణాటక: కాంగ్రెస్‌ పార్టీని మళ్లీ బతికించిందా?

కర్ణాటకలో తాజాగా బిజెపికి పెద్ద షాకే తగిలింది. ఇప్పటివరకు అధికారంలో ఉన్న బిజెపి తన అధికారాన్ని వదులుకోవాల్సి వచ్చింది. గతంలో 104 స్థానాలతో హైయెస్ట్ మెజారిటీ సాధించింది భారతీయ జనతా పార్టీ. 78 స్థానాలతో ఓడిపోయిన కాంగ్రెస్ ఆ తర్వాత జెడిఎస్ నుండి ముఖ్యమంత్రిని చేసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019 పార్లమెంటరీ ఎన్నికల సమయానికి భారతీయ జనతా పార్టీపై ఒక సింపతి వచ్చిందని తెలుస్తుంది.

దాని ఎఫెక్ట్ తో ఏకంగా 26 పార్లమెంటరీ స్థానాలను గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ.  కాంగ్రెస్ పార్టీ అయితే అప్పుడు తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ నుండి కొంత మంది, జెడిఎస్ నుండి కొంతమంది వచ్చి భారతీయ జనతా పార్టీలో కలవడం అయితే జరిగింది. దానితో భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో సింగిల్ గానే మెజారిటీ సాధించింది భారతీయ జనతా పార్టీ.

పర్సంటేజ్ పరంగా చెప్పుకోవాలి అనుకుంటే 2019లో భారతీయ జనతా పార్టీకి 36% ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 38% ఓట్లు తో, సీట్లు మాత్రం తగ్గిన పరిస్థితి  ఏర్పడింది. దాని ప్రభావం ఆ తర్వాత చూశాం. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ సింగిల్ గా వచ్చి కూటమిగా ఏర్పడుతుందని అంచనాలు 80% ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఇంకా ఫ్రీ పోల్స్ మాత్రం ఒక 10%  కాంగ్రెస్ సింగిల్ గా వస్తుందని అంచనా వేశాయి.  

ఫైనల్ గా అదే జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన అవకాశం దక్కింది అది సింగిల్ గానే అధికారంలోకి వచ్చింది. భజరంగ్ దళ్ నిషేధం అంటూ కాంగ్రెస్ అంటే, జై భజరంగ భళి అని భారతీయ జనతా పార్టీ తరఫునుండి నరేంద్ర మోడీని, అమిత్ షాను, ఇంకా యోగి ఆదిత్యనాథ్ లతో కూడా ప్రచారం చేయించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. కర్ణాటకలో బిజెపికి పెద్ద షాకే తగిలింది ఈ రకంగా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: