రహస్యం: చైనాలో అమెరికా సీక్రెట్‌ ఆపరేషన్‌?

అనేక దేశాల్లో చైనా పోలీసులను పెట్టుకున్నారు. అమెరికాలో చైనా కు సంబంధించిన పోలీసులు ఉన్నారు. అమెరికాలో నివసిస్తున్న చైనీయులకు  వివిధ రకాల సేవలందించేందుకు చైనా ఏకంగా పోలీస్ స్టేషన్ నే పెట్టుకుంది. అది అమెరికాకు తెలియకుండా వారి దేశంలో ఏర్పాటు చేసుకుంది. చైనా వారి పాస్ పోర్టు వెరిఫికేషన్ కు సంబంధించి అని చెప్పినా అనధికారంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి.

అమెరికా చైనాలో నిఘా విభాగం ఏర్పాటు చేసిందని చైనా పోలీసులు దాడులు చేశారు.  క్యాప్టిజం పార్టనర్స్ అనే  అమెరికా మింట్  గ్రూపునకు చెందిన సంస్థ షాంఘై లో ఉంది. దీనిపై చైనా పోలీసులు దాడులు చేశారు.  2006 సంవత్సరంలో బ్రెయిన్ కన్సల్టెంట్, మోర్గాన్స్ స్టాన్లీ అనే వారు దీన్ని పెట్టారని తెలుస్తోంది. ఇందులో 5 లక్షల మంది నిపుణులు ఉన్నారు. చైనాలో ఉన్న రహస్యాలను వీరు చేరవేస్తున్నారని డ్రాగన్ కంట్రీ ఆరోపిస్తుంది.  

ఈ సంస్థ అమెరికాకు గూడచార్యం చేస్తోందని చైనాలో రహస్యాలను అన్నింటిని అమెరికా నిఘా వర్గానికి చేరవేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తుంది. ఇందులో ఒకరిని అరెస్టు  చేసినట్లు చెప్పింది. గూడచార్యంతో పాటు వీరిపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నట్లు చెప్పింది. తప్పుడు పనులు చేశారని ఆరుగురు కీలక వ్యక్తులను అరెస్టు చేసింది. గత నెలలో ఈ కంపెనీలో చేసిన తప్పుల వల్లే అరెస్టులు చేశామని చైనా చెబుతోంది. కానీ దీని వెనక మరో కారణం ఉందని నిపుణులు చెబుతున్నారు.

చైనా నుంచి వెళ్లిపోదామనుకుంటున్న సంస్థలపై ఇలాంటి దాడులకు డ్రాగన్ కంట్రీ  దిగుతోందని అమెరికా ఆరోపిస్తుంది. అమెరికా, యూరప్, జపాన్, జర్మనీ లాంటి దేశాలు చైనాలో పెట్టుబడులు పెట్టి అక్కడ వ్యాపారాలను కొనసాగించాయి. ఇప్పుడు అవన్నీ వద్దని చైనా నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాయి.  అందుకే ఇలాంటి దాడులకు చైనా తెగబడుతోందని అమెరికా ఆరోపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: