భారత్‌ రూట్‌లోనే పాకిస్తాన్‌.. రష్యాతో బేరం?

రష్యా దగ్గర పాకిస్తాన్ ఆయిల్ కొనాలనుకుంటుంది. దానికి రష్యా కూడా సరేనని చెప్పింది. అయితే భారత్ కి ఇచ్చే ధరకే తమకు ఇవ్వాలన్నట్లుగా పాకిస్తాన్ రష్యాని అడిగిందని తెలుస్తుంది. రష్యాకు చైనా స్నేహితుడు. అలాగే పాకిస్తాన్ కు చైనాకు మంచి స్నేహ బంధం ఉంది. కాబట్టి స్నేహితుడికి స్నేహితుడు కూడా తనకు స్నేహితుడైనట్టు, అలా రష్యాకు చైనా కూడా సన్నిహితమైంది.

కానీ ఆ తర్వాత సంబంధాలు అటు ఇటుగా అవ్వడంతో ఈ ఒప్పందం అనేది క్యాన్సిల్ అయింది అని తెలుస్తుంది. కానీ తాజాగా షర్గోవ్ ఇండియాకి రావడం, పాకిస్తాన్ మంత్రి బిలావర్ బుట్టో జర్దారి కూడా ఇండియాకి రావడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చల్లో ఒక ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తుంది. దాని ప్రకారం 7,50,000 బారెళ్ళు పాకిస్తాన్ కు రష్యా అమ్మడానికి రెడీ అయింది అన్నట్లుగా తెలుస్తుంది. పాకిస్తాన్ చైనా కరెన్సీ యువాన్స్ లో పే చేయడానికి రెడీ అయ్యిందట.

మొదటి కార్గో ఏడు లక్షల 50 వేల బారెల్స్ తో రాబోతుందని తెలుస్తుంది. జూన్ నాటికి అది పాకిస్తాన్ చేరుకుంటుంది. దీనికి గాను పాకిస్తాన్ ఒక్కొక్క బ్యారెల్ కి 50 నుండి 52 డాలర్లు, అంటే 60 డాలర్ల లోపే చెల్లించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. మొన్న అమెరికా వెళ్లి జీ7 దేశాలని  పాకిస్తాన్ అడిగి వచ్చింది. ఏమని అంటే మేము ఆయిల్ కొనుక్కుంటాం అని అడిగింది.

అయితే దానికి జీ7 దేశాలు ఏమన్నాయంటే మేము ఎంత లోపు ధర చెప్పి కొనుక్కోమంటామో అంత ధరకే నువ్వు కొనుక్కోవాలని అన్నాయి. వాళ్లయితే 60 డాలర్ల లోపు కొనుక్కోమని చెప్పారట. అయితే ఇక్కడ 52 డాలర్లకే పాకిస్తాన్ కి ఇవ్వడానికి రెడీ అయింది రష్యా. భారతదేశానికి 45 డాలర్లకి ఇస్తుంది అది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ కి 52 డాలర్లకి ఇవ్వడంతో భారత్ కి కూడా ఈ రేటు 50 డాలర్ల వరకు పెంచినట్టుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: