సమరమే: రష్యా వార్నింగ్‌ ఇస్తున్న తగ్గని ఉక్రెయిన్‌?

క్రిమియా మొత్తాన్ని రష్యా ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. అయితే అదే క్రిమియాలో ఉన్న సెవస్ధ పోల్ మీద డ్రోన్లు సాయంతో దాడి చేసింది ఉక్రెయిన్. రష్యా ఏయిర్ డిఫెన్స్ సిస్టం ఇక్కడ బాగా పనిచేసిందని తెలుస్తుంది. కానీ ఆ డ్రోన్ల సాయంతో చేసిన దాడిలో అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ నిల్వలే ధ్వంసం అయ్యి పెద్ద ప్రేలుడు సంబంధించిందని తెలుస్తుంది. ఆ తర్వాత మిస్సైల్స్ ప్రయోగం ఇంకా రైళ్ళ మీద దాడి అనేవి కూడా ఈ సందర్భంలో జరిగినట్లుగా తెలుస్తుంది.

తాజాగా అక్కడ మరో 10 డ్రోన్ల సాయంతో దాడి చేసిందట రష్యా. అతిపెద్ద విధ్వంసాన్ని కోరి రష్యా అలా చేసిందని అంటున్నారు. ఇప్పటిదాకా తనను తాను కాపాడుకోవడానికి, తన ప్రాంతాలైన బాగ్పుత్ ను, సారిడార్ ను ఇలాంటి ప్రాంతాలను కాపాడుకోవడానికి డిఫెన్స్ తరహాలో ముందుకు  వెళ్ళింది ఉక్రెయిన్. కానీ ఇప్పుడు ఈ డిఫెన్స్ సిస్టం వదిలేసి ఆఫెన్స్ తరహాలో ఇప్పుడు  ఉక్రెయిన్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది.

అమెరికా, యూరప్ ఇచ్చిన ఆయుధాలతో రష్యాను నిలువురించుకుంటూ వచ్చాను అనుకుంది ఉక్రెయిన్. కానీ ఆరు నెలలుగా వీళ్ళ మధ్య యుద్ధంలో రష్యాదే డామినేషన్ అవ్వడంతో  తిరిగి మరింత శక్తివంతంగా మారి ఆ రష్యాపై ఎదురు దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది ఉక్రెయిన్. తాజాగా ఉక్రెయిన్ రష్యాపై 10 డ్రోన్లతో దాడి చేసినట్లుగా తెలుస్తుంది.

తాజాగా రష్యా అపాయింట్ చేసిన సెవస్థ పోల్ గవర్నర్ ఉక్రెయిన్ తమపై పది డ్రోన్లతో దాడి చేస్తే, మేము వాటిని ఎదుర్కొన్నామని ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది. 10 డ్రోన్లు రాత్రి పూట క్రిమియా ప్రొవెన్స్ పై దాడి చేస్తే వాటిని ధ్వంసం చేయగలిగాము. కానీ మూడు డ్రోన్లు వెళ్లి పోర్టులో పడ్డాయి. కానీ  ఎటువంటి నష్టం జరగలేదని ఆయన చెప్తున్నారు. సెవస్థ పోల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం సమర్థవంతంగా వాటిని ఆపగలిగిందని  ఆయన చెప్పారు. ఇలా ఉక్రెయిన్ మరింత శక్తితో రష్యాపై దాడి చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: