చంద్రబాబు ఫార్ములా ఫోలో అవుతున్న మోదీ?

సాయంత్రం అయితే చిరు తిండి కోసం స్ట్రీట్స్ వెంట తిరుగుతూ ఉంటారు మనలో చాలామంది. కానీ అవి ఒక నిర్ణీత సమయం వరకు మాత్రమే ఉంటాయి. ఏ కొద్దిమందో హోమ్ ఫుడ్స్ ను ఫాలో అవుతుంటారు. గతంలో చంద్రబాబు నాయుడు అమరావతిని అభివృద్ధి చేయాలంటే ముందు కల్చర్ మార్చాలి అని సంకల్పించుకున్నారట. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు మెట్రో లుక్ ఉన్న ప్రాంతాలకే వస్తూ ఉంటాయి.

కాబట్టి మెట్రో సిటీ కల్చర్ ని తీసుకురావడం కోసం విజయవాడలో ఈట్ స్ట్రీట్ లను తీసుకువచ్చారు. అవి రాత్రి వేళల్లో స్ట్రీట్ ఫుడ్స్ తినాలనుకునే వాళ్ళకి వీలుగా సుమారు రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ ఈట్ స్ట్రీట్లను ఇందిరా గాంధీ స్టేడియం వద్ద, సత్యనారాయణపురం దగ్గర, బెంజ్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కరోనా టైంలో వీటిని ఆపివేయడం జరిగింది.

తర్వాత మళ్లీ మొదలుపెట్టినా ఇందిరా గాంధీ స్టేడియం వద్ద కొంత లుక్ మార్చి, అది కూడా రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే వాటి సమయాన్ని నిర్ణయించారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు  చేసిన సంస్కరణ అయితే ఇది. ఇప్పుడు ఆయన విజన్ లానే, కేంద్ర ప్రభుత్వం కూడా ఆరోగ్యకరమైన చిరు తిండి లను ఏర్పాటు చేయడం కోసం  పైలట్ ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా 100 ఫుడ్ స్ట్రీట్లను ఏర్పాటు చేయాలని సంకల్పించుకుందట.

ఇందుకోసం ఆంధ్రాలో నాలుగు, తెలంగాణలో నాలుగు ఫుడ్ స్ట్రీట్లను ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తుంది. ఇందులోని ఆహారం ఎఫ్ ఎస్ ఎస్ ఐ నిబంధనలు ప్రకారం ఉంటుందట. ఒక్కో ఫుడ్ స్ట్రీట్ కు కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తారట కేంద్రం. అది కూడా ఆయా వ్యాపారులు సొంత బ్రాండింగులతో చేసుకోవాలని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: