కర్ణాటక: బీజేపీ ఆ స్కోర్‌ సాధిస్తుందా?

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి గురించి చెప్పాల్సి వస్తే అక్కడ ఆ పార్టీ పని అయిపోయిందని, వచ్చే ఎలక్షన్లలో 20-30సీట్లు మాత్రమే అది గెలుచుకోబోతుందని సర్వేలు చెబుతున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం తాము వంద నుండి 120సీట్లు వరకు గెలుచుకుంటామని, తాము జెడిఎస్ తో కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

కర్ణాటకలో బిజెపి 37.67% ఓట్లతో 13స్థానాలను గెలుచుకుంటుందట. కాంగ్రెస్ 42.69% ఓట్లతో 108స్థానాలు గెలుచుకుంటుందట. జెడిఎస్ 16.15% ఓట్లతో 23స్థానాలను గెలుచుకుంటే, ఇతరులు 3.49శాతం ఓట్లతో 4స్థానాలు గెలుచుకుంటారని అంచనా. కాంగ్రెస్ పార్టీకి గెలవడానికి 90% వరకు ఛాన్సులు ఉన్నాయని సర్వేలో తేలుతున్న విషయం.

సాధారణంగా సీట్ల విషయంలో జోనల్ వైడ్ గా చూసుకున్నప్పుడు బెంగళూరులో టోటల్ సీట్లు 32. అందులో రూరల్ 4, అర్బన్ 28. రూరల్ లో బిజెపికి 2, కాంగ్రెస్ కి1, జేడీఎస్ కి 1వస్తాయని, అర్బన్ లో బిజెపికి 13, కాంగ్రెస్ కి 13 జేడీఎస్ కి 2వస్తాయని అంటున్నారు. అలాగే ఓల్డ్ మైసూర్ లో టోటల్ 36సీట్లలో చామరాజ్ నగర్ లో బిజెపికి 2,కాంగ్రెస్ కి 2, జెడిఎస్ కి 0 వస్తాయట.

చిక్ మంగళూరులో బిజెపికి 1, కాంగ్రెస్ 1, జేడీఎస్ కి 3 వస్తాయట. అస్సాంలోని 7 సీట్లలో బిజెపికి 2, కాంగ్రెస్ కి 1, జేడీఎస్ కి 4 వస్తాయట. కోడూరులో బిజెపికి 2, కాంగ్రెస్ కి 0, జెడిఎస్ కి 0 వస్తాయట. మాండ్యాలో 7 సీట్లు ఉన్నాయని బిజెపికి అక్కడ ఏమీ రావని, కాంగ్రెస్ కి 3, జెడిఎస్ కి 4 వస్తాయని అంటున్నారు. మైసూర్ లో 11 సీట్లలో బిజెపికి 1, కాంగ్రెస్ కి 6, జేడీఎస్ కి4 వస్తాయని అంటున్నారు. అయితే జెడిఎస్ తో కలిస్తే బిజెపి అధికారంలోకి వస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: