దారుణం: రోజురోజుకూ దిగజారుతున్న పాక్‌ పరిస్థితి?

గత కాలంలో  ఒక్క రూపాయికి కూడా ఎంతో విలువ ఉండేది. కానీ ప్రస్తుతం సామాజిక పరిస్థితుల్లో ఒక పది వేలు సంపాదించినా అది చాలా తక్కువ మొత్తంతో సమానం అవుతుంది. అది తక్కువ సంపాదన అవుతుంది. కానీ భారతదేశంలో పది వేలు అంటే, పాకిస్తాన్ లో పాతిక వేలుతో సమానమని అంటారు. పాకిస్తాన్ లో ఇప్పుడు 100 కి 10 శాతం మంది కూడా పాతిక వేలు సంపాదించడం లేదని అంటున్నారు.

గతంలో ఇండియన్ కరెన్సీ ప్రకారం 40,000-50000 సంపాదించేవారు, ఇప్పుడు   పాతిక వేల రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారని, అంటే అక్కడ పదివేల రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారని తెలుస్తుంది. అక్కడ తక్కువ సంపాదనతో పాటుగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగిపోవడం, తినడానికి తిండి లేకుండా, త్రాగడానికి నీరు కూడా లేక అక్కడ పరిస్థితులు అస్తవ్యస్తమవుతున్న నేపథ్యంలో, అక్కడ దారుణమైన సంక్షోభాన్ని వాళ్ళు ఫేస్ చేస్తుండగా మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లుగా అక్కడ ఇంకో దారుణమైన పరిస్థితి నెలకొంది.

అదేంటంటే అక్కడ మందులు రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అక్కడ మందులు రేట్లు దారుణంగా ఒక 20 శాతం వరకు అంతకు ముందు రేట్లపైన పెరిగిపోయాయి అని తెలుస్తుంది. పాకిస్తాన్ లో ఇలాంటి అత్యంత దారుణమైన సంక్షోభాన్ని చవిచూస్తున్న  ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ నుంచి లోన్ పొందే క్రమంలో అక్కడి పాకిస్తాన్ ప్రభుత్వం ఒక రకంగా, ఈ రకంగా ప్రజల్ని తన స్వార్థం కోసం ఇబ్బంది పెడుతున్నట్లుగా తెలుస్తుందని కొంతమంది అంటున్నారు.

అత్యవసర మందుల మీద 14 శాతం, మాములు మందులమీద 20% పెంచారు అని అంటున్నారు. క్యాబినెట్ కోఆర్డినేషన్ ఎకడమిక్ కమిటీ మీటింగ్ లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏ ప్రభుత్వమైనా ప్రజలు ఇబ్బంది పడకూడదని అప్పు తీసుకుంటారు గాని, ఇబ్బంది పెట్టి కాదు అని కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: