కొత్త సచివాలయంతో కేసీఆర్‌ క్రేజ్‌ పెరుగుతోందా?

తెలంగాణాలో సచివాలయం నిర్మాణం విషయంలో ఇప్పుడు కెసిఆర్ పాపులర్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. అది అందంగా ఉందా లేదంటే అది మూడు మతాల కలయికా అన్నట్లుగా, ఈనాడు పేపర్ రాసినట్లుగా ఎవరు అనుకోవడం లేదని అంటున్నారు. ఇప్పటివరకు శతాబ్దాల కాలం నాటి నిర్మాణాలతో లేదంటే నిజాం కాలం నాటి రాజుల కట్టడాలతో పాపులర్ అవుతూ వస్తున్న హైదరాబాద్ మెడలోని మణిహారంలో ఇది ఒక వజ్రం అవ్వబోతుందని తెలుస్తుంది.

తెలంగాణ ప్రాంతం ఇప్పుడు ఈ సచివాలయం పేరుతో పాపులర్ అవ్వబోతుందని అంటున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అని కాకుండా కేవలం తెలంగాణ ప్రాంతం అని ఎందుకన్నామంటే భాషా ప్రాతిపదికన విభజించిన ప్రాంతాలలో రాయలసీమ మాండలికాలని వాడే ప్రాంతాన్ని రాయలసీమ ప్రాంతం అని, కోస్తా భాషను మాట్లాడే వాళ్ళని బట్టి కోస్తా ప్రాంతమని, అలాగే తెలంగాణ యాసను మాట్లాడే వాళ్లను బట్టి తెలంగాణ ప్రాంతమని, ప్రాంతాల వారిగా భాషా ప్రాతిపదికన పేర్కొన్నప్పుడు తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా కావాలని పోరాడి దానికొక అస్తిత్వాన్ని కల్పించారు కెసిఆర్.

లేదంటే అది గతంలో నిజాం రాష్ట్రం, తర్వాత హైదరాబాద్ రాష్ట్రం ఆ తర్వాత తెలంగాణ ప్రాంతం అయ్యి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంగా అవతరించింది. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కట్టించిన సీఎం క్యాంప్ ఆఫీస్ ని మార్చేసి ప్రగతి భవన్ ని నిర్మించారు కెసిఆర్. ఇప్పటివరకు వినోదాత్మకమైన దానికే ఫేమస్ అయిన నెక్లెస్ రోడ్డుపై అతి పెద్దదైన  అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి విజ్ఞానాత్మకంగా కూడా ఫేమస్ అయ్యేలా మార్చేసారాయన. ఈ రెండిటితో పాటు ఇప్పుడు తాజాగా సచివాలయాన్ని కూడా అద్భుతంగా  కట్టడం ద్వారా కెసిఆర్ తనదైన ముద్రను వేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది.

అయితే మొన్నటి వరకు ఉమ్మడిగా ఉన్న సెక్రటేరియట్ ని జగన్ ఇచ్చేసిన తర్వాత దానిని పడగొట్టి కెసిఆర్ తన ఆత్మ అభిమానాన్ని నిరూపించుకోవడానికి కట్టిన సౌధమే సచివాలయం. ఇది తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద విశేషంగా నిలుస్తుందని చరిత్రకారులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR

సంబంధిత వార్తలు: