అయ్యో.. కేసీఆర్‌ మహారాష్ట్ర ఆశలు గల్లంతేనా?

తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా కేసీఆర్ మార్చారు. ఆంధ్రలో కూడా ఈ పార్టీ గుర్తింపు కోల్పోయింది. దీనికి తెలంగాణలో ప్రాంతీయ పార్టీ గుర్తింపు మాత్రమే ఉంది. అయితే బీఆర్ఎస్ పెట్టిన తర్వాత జరుగుతున్నకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. దీనికి కారణాలు ఏమీ చెప్పకున్నా అభ్యర్థులు దొరక్క పోవడంతోనే  చేయడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి.

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని బోకర్ తాలుకా లో 18 వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ చతికిలబడింది. ఇందులో బీజేపీ బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు, కాంగ్రెస్ నుంచి 13 మంది గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఒక్కరు కూడా గెలవలేరు.

ఈ మార్కెట్ మీద పట్టున్న నాగ్ నాథ్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. మహారాష్ట్ర లో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ స్థానానికి సంబంధించిన ఈ  ప్రాంతంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ కు మొదటి నుంచి మంచి పట్టు ఉంది. కానీ నాగ్ నాథ్ సింగ్ నేతృత్వంలో బరిలోకి దిగిన 18 మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు.

ఇప్పటికే బీఆర్ ఎస్ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కువగా మహారాష్ట్రలో పర్యటిస్తూ అక్కడ పార్టీ ని బలోపేతం చేయడానికి  చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అక్కడ జరిగిన ఎన్నికల్లో ఒక్క డైరెక్టర్ స్థానం గెలుచుకోక పోవడంతో పార్టీ శ్రేణులు నిరాశ చెందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తెలంగాణ మోడల్ అని చెబుతూ ప్రజల్లోకి వెళుతున్న కేసీఆర్ దాన్ని అందరికీ అర్థవంతమయ్యే విధంగా చేయడానికి ఇంకా కాస్త సమయం పడుతుందని పార్టీ శ్రేణులు అధైర్య పడకుండా ముందుకు సాగుతూ పని చేసుకుంటూ వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: