భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?

పాకిస్థాన్ సైనికాధికారి ఒకరు ఇటీవల మాట్లాడుతూ.. భారత్ కాల్పుల విరమణ ఒప్పందాలు ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.  ఏడాదిలో 56 సార్లు కాల్పులు జరిపిందని పేర్కొన్నారు. దీనిపై తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు.  1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో లొంగిపోయిన పాక్ సైనికుల చిత్రాల వీడియోలను భారత్ బయటపెట్టడంపై మండిపడ్డారు. పాక్ జర్నలిస్టులు అడిగిన ఓ ప్రశ్నకు పాక్ మాజీ సైనికాధికారి బాజ్వా మాట్లాడుతూ.. యుద్ద  ట్యాంకుల్లో పెట్రోల్ పోసుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఇలాంటి సమయంలో ఎలా యుద్దం చేస్తారని ప్రశ్నించారు.

వీటన్నింటిని మధ్యన యుద్దం ఇప్పుడు ఉండకపోవచ్చని తెలుస్తోంది. పాక్ అధికార ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి మాత్రం  మా జోలికి వస్తే మా సత్తా ఏమిటో భారత్ చూపెడతాం అని బీరాలు పలుకుతున్నాడు.  పాకిస్థాన్ మాజీ సైనికాధికారి అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ.. ప్రస్తుత సమయంలో భారత్ యుద్ధానికి దిగకపోవచ్చు. వచ్చే సంవత్సరం యుద్ధానికి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పారు.

ప్రస్తుతం షాంఘై కోపరేటివ్ ఆర్గనైజేషన్ కు భారత్ చైర్మన్ గా ఉంది. కాబట్టి యుద్ధానికి దిగకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే జీ 20కి కూడా ఇండియానే చైర్మన్ గా కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో యుద్ధానికి దిగే అవకాశం లేదన్నారు. ఒక వేళ ఇప్పుడు యుద్దం చేస్తే అది వేరే పరిణామాలకు దారి తీస్తుందన్నారు.

ఒక వేళ యుద్దం చేయాల్సి వస్తే వచ్చే సంవత్సరంలో ఇండియాలో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి దాని ముందు యుద్ధానికి దిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోందని అన్నారు. 1947, 1965, 1975, 1999 లో పాకిస్థాన్ భారత్ తో యుద్ధానికి దిగి ఓడిపోయింది. ఇన్ని సార్లు ఓడిపోయిన దానికి ఇంకా బుద్ది వచ్చినట్లు కనిపించడం లేదు. ఈ సారి మాత్రం యుద్ధం చేస్తే పాక్ కు తగిన గుణపాఠం తప్పదు.  పాక్ భారత్ తో పెట్టుకుంటే తీవ్రంగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: