ఇండియాపై పాక్‌, చైనా కుట్రలు.. సాగట్లేదుగా?

వివిధ దేశాలకు ఎక్కువ అప్పులు ఇచ్చి చైనా తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తోంది. చైనా, పాకిస్థాన్ దేశాలు ఎప్పుడూ కూడా భారత్ పై విషం చిమ్ముతూనే ఉంటాయి. ఈ రెండు దేశాలు జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ ను నిలదీయాలని ప్రయత్నించాయి. ప్రస్తుతం పాకిస్థాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయి భారత్ పై కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నాయి. చైనా పాకిస్థాన్ కు బదులుగా కాశ్మీర్ అంశంపై మాట్లాడటం మొదలు పెట్టింది.

చైనా, పాకిస్థాన్ లు భారత్ లోని లడక్, కాశ్మీర్ ప్రాంతాలపై ఇష్టారీతిన విమర్శలు చేశారు. దీన్ని అక్కడ ఉన్న భారత యువ ప్రతినిధులు దీటుగా తిప్పికొట్టారు. కేంద్రం తీసేసిన ఆర్టికల్ 370, 35 కారణంగా అక్కడ భారత రాజ్యాంగం అమలు చేయడానికి వీలవుతుంది. గతంలో ఈ చట్టాల కారణంగా ఇండియా నుంచి ఫండ్స్ మాత్రమే ఇచ్చి అభివృద్ది చేసేవారు. కానీ  ఆ ప్రాంతంలో మాత్రం ఇండియా పౌరులెవరూ భూములు కొనకుండా, స్థిర జీవనం ఏర్పరచు కోకుండా చట్టాలు అడ్డు వచ్చేవి. దీంతో కాశ్మీర్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా సంస్థలు వెనక్కి వచ్చేవి. దీంతో కాశ్మీర్ అభివృద్ధిలో వెనకడుగు వేసింది. అలాగే తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు చేసిన కృషిలో ఇది ఎంతో తోడ్పడుతుంది.

కానీ చైనా లడక్ లో అంతర్గత ప్రాంతమని వాదనలకు దిగుతోంది. పాకిస్థాన్ కాశ్మీర్ లో భారత్ పెత్తనంపై గుస్సగా ఉంది. అయినా భారత ప్రభుత్వం అక్కడ శాంతిని నెలకొల్పాలని తీసుకున్న నిర్ణయం ఆ రెండు దేశాలకు మింగుడు పడటం లేదు. ఎక్కడైనా సరే అంతర్జాతీయంగా సదస్సులు సమావేశాలు జరిగిన చోట కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చి ఇండియాను బదనం చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇండియా తరఫున వెళుతున్న ప్రతినిధుల బృందాలు చెబుతున్న సమాధానాలు విని పాక్ చైనా కంగు తింటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: