ఆ కార్టూన్‌తో భారత్‌ను అవమానించిన జర్మనీ పత్రిక?

భారత్ చైనా ను దాటి జనాభాలో మొదటి స్థానంలోకి వచ్చేసింది. దీని గురించి జర్మన్ లోని ఒక పత్రికలో వివాదాస్పద కార్టూన్ ను వేశారు. భారత్ లో  ఉన్నజనం ట్రైన్ పైన కూర్చొని వెళుతున్నట్లు చిత్రాన్ని గీసి పబ్లిష్ చేశారు. దీనిపై  ఇండియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  ఇలాంటివి ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జరుగుతున్నాయి. భారత్ లో  మొత్తం ఎలక్ట్రిక్ వైర్ సిస్టమ్ తో నడుస్తున్న రైళ్లే దర్శనమిస్తాయి.

ఒకప్పుడు బిహార్ లాంటి ప్రాంతాల్లో ఇలా జరిగేది. ఇప్పుడు అధునాతన టెక్నాలజీతో ఇండియా రైల్వేస్ దూసుకెళుతున్నాయి. కానీ జర్మన్ పత్రికలో వేసిన కార్టూన్ పై ఇండియాలో ని జర్మన్ అంబాసిడర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పత్రిక యజమాని, లేదా కార్టూనిస్టు ఇండియాకు వచ్చి ఇక్కడ ఢిల్లీలోని మెట్రో ట్రైన్ చూడాలని, ఇక్కడి రైళ్లలో ప్రయాణిస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. అంటే ఢిల్లీలో ఉండే రైళ్లు ఎంత నూతనంగా మారాయి. ఎంతవరకు అప్ డేట్ అయ్యాయి. తెలుసుకోకుండా ఇలా చేయడం తప్పని జర్మన్ అంబాసిడర్ వ్యాఖ్యనించడం కొసమెరుపు.

అవును ఒకప్పుడు ఇండియా రైల్వే వ్యవస్థ కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండేది కావచ్చు. కానీ రైల్వే వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి.దీని కోసం గతంలో రైల్వే కు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. నూతనంగా ఎన్నో మార్పులు చేశారు. ప్రస్తుతం వందే భారత్  ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టి ఎంతో దూర ప్రయాణాన్ని చాలా సులభతరం చేసేవారు.  ఇలా ఎన్నో ఎన్నెన్నో మార్పులు కనిపిస్తున్నాయి.

ప్రపంచంలోనే జనాభాలో మొదటి స్థానంలో ఉండి ఇన్ని సౌకర్యాలు కల్పించాలంటే ఆషామాషీ విషయం కాదు. అయినా ప్రజలందరికీ రవాణా మార్గాల్లో వీలైనంత సౌకర్యంగా ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కానీ దాన్ని మరిచి అసలు విషయాలు తెలుసుకోకుండా అభ్యంతరక కార్టూన్ లు వేసి భారతీయుల మనోభావాలు దెబ్బతీయడం సరికాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: