ఆత్మహత్య ఆలోచన వస్తుందా.. ఇది చదవండి!

చదువుకోని వారు కూడా జీవితంలో ఎన్నో గొప్ప విజయాలు సాధించారు. ప్రస్తుతం ఇంటర్ లో ఫెయిల్ అయితే చాలా మంది  విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరీక్షలు తప్పినంత మాత్రాన చనిపోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఫెయిల్ అయ్యాయో అక్కడే విజయం సాధించి నిరూపించాలి. అప్పుడే మనలో ఉన్న సత్తా బయటకు వస్తుంది మన శక్తి సామర్థ్యాలు తెలుస్తాయి.

ఇంటర్ లో ఫెయిల్ అయితే గతంలో ఏడాది వరకు ఎగ్జామ్స్ పెట్టే వారు కాదు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఒక నెలలోనే పెడుతున్నారు. అందులో బాగా రాసి పాస్ కావచ్చు. ఇంటర్ తర్వాత ఎంతో లైఫ్ ఉంటుంది. ఇంటర్ అనే అడ్డంకి ని దాటి ముందుకెళితే ప్రపంచం ఎంతో అందంగా కనిపిస్తుంది. దాని కోసమైనా ఇంటర్ అనే ఛాలెంజ్ ను పూర్తి చేయాలి.

పాస్ అయితే డిగ్రీతో పాటు ఎన్నో కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. కానీ ముందుగా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. ఇంటర్ మార్కులు అవసరమే కానీ ఫెయిల్ అయినంతా మాత్రాన నిరాశలో కూరుకుపోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఉదాహరణలు తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎవరో ఏదో ఫీల్ అవుతారని ఏదేదో అంటారని పట్టించుకోనవసం లేదు. మళ్లీ రాసి పాస్ అయితే వారే ఈ సారి గెలిచాడని వారే అంటారు.

ఫెయిల్ అయి ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులను పుత్రశోకం మిగిల్చిన వారిగా మిగిలిపోవద్దు. సచిన్ టెండూల్కర్ పెద్దగా చదువుకోని వ్యక్తి ప్రపంచానికే క్రికెట్ గాడ్ గా కొనసాగాడు. విశ్వ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. చిన్న విషయాలకు కుంగిపోయి, పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. జీవితంలో ఎన్నో అందమైన రోజులు ముందు ముందు ఉంటాయనే విషయాన్ని మరిపోవద్దు. జీవతంలో చదువు ఎంత ముఖ్యమో దాని తదనంతర రోజులు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఫెయిల్యూర్ అనేది జీవితంలో పెద్ద గుణపాఠం. దీని నుంచి ఎంతో నేర్చుకుని గెలుపు బాటలో పయనించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: