ఇక దేశంలో 'స్వలింగ' పెళ్లిళ్లు పెరుగుతాయా?

మగ, ఆడ వాళ్లు పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు. స్వలింగ సంపర్కులు ఎందుకు పెళ్లి చేసుకోకూడదనే వాదనలతో సుప్రీం కోర్టులో ఈ మధ్య తీవ్రమైన వాదనలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో సుప్రీం కోర్టు ఒక ట్విస్ట్ ఇచ్చింది.  దేశంలో ప్రస్తుతం స్వలింగ వివాహాలను చట్టబద్దత లేదని చెప్పింది. అయినప్పటికీ ఒక వేళ వారు పెళ్లి చేసుకుంటే వారికి కావాల్సిన సామాజిక న్యాయ, అవసరాలను తీర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

స్వలింగ సంపర్కుల పెళ్లిళ్ల గురించి సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. స్వలింగ జంటలకు హక్కులు కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక మార్గం కనుగొనాలని సూచించింది. ఇలాంటి జంటలకు ఉమ్మడి బ్యాంకు ఖాతాలు ఇవ్వడం, బీమా పాలసీల్లో భాగస్వాములు చేసే విషయంలో నామినీలపై  స్పష్టత ఇవ్వాలని కోరింది.

స్వలింగ సంపర్కుల వివాహంలో పార్లమెంట్ తీర్మానమే ఫైనల్ అని తాము అంగీకరిస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. స్వలింగ వివాహం ప్రభుత్వం గుర్తించపోయినా దానికొక విధానం అవసరమని అభిప్రాయం వ్యక్తం చేసింది. చట్ట బద్ధత కల్పించకుండా వారికి ఎలాాంటి హక్కులు కల్పిస్తారో చెప్పాలని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని సొలిసిటర్ ను అడిగింది.

ప్రాథమిక హక్కులను వినియోగించుకుంటున్న అందరూ స్వలింగ సంపర్కం ద్వారా దాన్ని వాడుకోవాలనుకోవడం సరికాదని సొలిసిటర్ తుషార్ మెహత కోర్టుకు సమాధానమిచ్చారు. తదుపరి విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిల వివాహం చట్టబద్ధతకు ఉన్న అడ్డంకులు, ఒక వేళ చట్టం చేసి హక్కులు కల్పిస్తే కలగబోయే  దుష్పరిణామాలు, ఏ విధమైన సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఇలా ప్రతి అంశంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. దీనికి చట్టబద్ధత కల్పిస్తే ఈ వివాహాల సంఖ్య పెరిగి ఇతర ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: