ప్రపంచాన్ని శాసించిన బ్రిటన్‌.. పాపం ఇప్పుడిలా?

ప్రపంచానికి పరిపాలన నేర్పామని చెప్పుకునే దేశం బ్రిటన్. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలిన ప్రాంతం. ప్రపంచ సంపదను దోచుకుని అగ్రరాజ్యంగా సంపన్న దేశంగా సుఖాలు అనుభవించింది. కానీ కాలం మారింది. తరాలు గడిచిపోయాయి. సంపదలు కరిగిపోయాయి. విలాసవంతమైన జీవితాలు గడిపే అక్కడి ప్రజలు కూడా ఆర్థికంగా కష్టాలు ఉంటాయా అనుకునే వారు. నిజంగానే ఆర్థికంగా తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది ఇంగ్లీష్ గడ్డ.

నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఆయిల్ రేట్లు పెరిగి, ఆర్థికపరమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు పోయి ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో బ్రిటిష్ బ్రాడ్ కాస్ట్ ఆప్ ఇండియా సంచలన విషయం వెలుగులోకి తెచ్చింది. ఒకప్పుడు బ్రాండెడ్ వస్తువులు వాడే విషయంలో బ్రిటన్ పౌరుల తర్వాతనే ఎవరైనా.. కానీ ఇప్పుడు బ్రాండెడ్ వస్తువులు కొనే స్థోమత తగ్గిపోయింది. సెకండ్ హ్యండ్ వస్తువులు బ్రిటన్ పౌరులు కొనేందుకు మొగ్గు చూపుతున్నారని తెలిపింది.

బ్రిటన్ ఆర్థిక సంక్షోభం ముదిరిపోయిందనే దానికి ఇది మంచి ఉదాహరణ గా చెప్పొచ్చు. ఓ వైపు తన దేశం ఆర్థికంగా కుదేలవుతుంటే ఉక్రెయిన్ దేశానికి యుద్ధంలో సాయం చేసేందుకు డబ్బులు పంపిస్తూనే ఉంది. ఆయుధాలను సరఫరా చేస్తూనే ఉంది. దీని వల్ల బ్రిటన్ కు వచ్చిన లాభం ఏమీ లేదు. ఇంకా నష్టపోవడం తప్ప. ఇలాంటి సమయంలో బ్రిటన్ ఆ దేశ ఆర్థికాభివృద్ధి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తమ పౌరుల జీవన విధానంలో వస్తున్న మార్పులను గమనించాలి. ఒకప్పుడు ఏ విధంగా బతికారు. ప్రస్తుతం వారు జీవిస్తున్న శైలి ఏమిటి? ఇలా ఒక్కొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకుని ముందుకెళ్లాలి. బ్రిటన్ లో మళ్లీ ఉన్నత జీవనం గడపాలంటే ఆర్థికంగా డెవలప్ అయ్యేందుకు సరైన ప్రణాళికలు చేపట్టాలి. బ్రిటన్ ప్రధాని గా ఉన్న రిషి సునాక్ ముందు ఇలాంటి ఎన్నో సవాళ్లు ముందున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: