ఉక్రెయిన్ చేతిలో అమెరికా బ్రహ్మాస్త్రాలు?

అమెరికా ఇచ్చిన డ్రోన్లతో ఉక్రెయిన్ రష్యాపై దాడులకు దిగుతోంది. కానీ స్విచ్ ప్లేన్ డ్రోన్లతో రష్యాపై ఉక్రెయిన్ దాడులకు పాల్పడుతోంది. వీటిని ధ్వంసం చేయడంలో మొదట్లో కాస్త ఇబ్బంది పడిన రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్ పై దాడులు మాత్రం చేస్తూనే ఉంది. అత్యంత అధునాతమైన డ్రోన్లతో రివర్స్ ఎటాక్ ను ప్రారంభించిన ఉక్రెయిన్ రష్యా సరిహద్దు ప్రాంతమైన బెల్ గ్రేడ్ లో దాడులకు తెగబడింది. అయితే వీటిని రష్యా కూల్చేసేందుకు కష్ట పడాల్సి వచ్చింది. బెలెగ్రెడ్ ఉక్రెయిన్ సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ అమెరికా అధునాతన డ్రోన్లను ఉపయోగించి దాడులు చేసేందుకు సిద్ధపడింది.

స్విచ్ ప్లేన్ డ్రోన్లు అనేవి సూసైడ్ డ్రోన్లుగా పిలుస్తారు. రష్యా సైనిక స్థావరాన్ని ధ్వంసం చేయడానికి దీన్ని ఉపయోగించారు. ఇలాంటి డ్రోన్లు అమెరికా దగ్గర ఉంటాయి. ఈ డ్రోన్ల వల్ల రష్యా లోని ముఖ్యమైన స్థలాలను ధ్వంసం చేసి తమ ఆధిపత్యాన్నిచాటాలని ఉక్రెయిన్ భావించింది. కానీ డ్రోన్లను కూల్చివేసే శక్తివంతమైన ఆయుధాలను ప్రయోగించిన రష్యా ఈ విషయంలో సక్సెస్ అయింది. ఉక్రెయిన్ లోకి ఒక వైపు రష్యా యుద్ధ ట్యాంకులు, సైనికులు చొచ్చుకుపోతుంటే అక్కడ దాడిని మరిచిన ఉక్రెయిన్ రష్యా లోని అంతర్గత ప్రాంతాల్లో దాడులు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. రష్యా ఇప్పటికే స్వాధీనం చేసుకున్న క్రిమియా తదితర ప్రాంతాల్లో రివర్స్ ఎటాకింగ్ చేస్తోంది.

దీని ద్వారా రష్యా ఆత్మ రక్షణలో పడేట్లు చేయడం ద్వారా దాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తుంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల అనేక సమస్యలు వస్తున్న, ఇంకా పట్టు విడవడం లేదు. దీనితో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల మీద ప్రభావం పడుతోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్దం ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో మరింత దాడులు పెరిగి అణ్వస్త్ర దాడిగా మారుతుందోనేమోనని భయపడాల్సిన పరిస్థితి. ఈ యుద్దం ఇంకెంత కాలం కొనుసాగుతుంది.. ఎవరు గెలుస్తారు. ఎవరు ఓడితారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: