రష్యా రివర్స్ అటాక్‌తో అమెరికాకు చుక్కలు?

ఇన్ని రోజులు అమెరికా రష్యాను ఆర్థిక పరంగా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించింది.  కానీ రష్యా రివర్స్ ఎటాకింగ్ కి దిగుతోంది. అమెరికా చెప్పినట్లు వినే లాటిన్ అమెరికా దేశాల్లో రష్యా, చైనా తమ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.  బ్రెజిల్ అధ్యక్షుడు ఓలా రష్యా విదేశాంగ మంత్రి సెర్గోస్ తో మీటింగ్ పెట్టారు. రష్యాతో 100 బిలియన్ డాలర్ల వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకున్నారు.  అమెరికాకు చెందిన సెంట్రల్ ఫర్ ఇన్విస్టిగేషన్ ఆఫ్ అమెరికా సీఐఎ లాటిన్ అమెరికా దేశాల్లో కుట్రలు పన్నిందని తెలుస్తోంది. దాదాపు లాటిన్ అమెరికాలోని 12 దేశాల్లో 34 కు పైగా సీక్రెట్ గా సమాచారం సేకరించిందనే ఆరోపణలు ఉన్నాయి.

1954 తర్వాత లాటిన్ అమెరికా దేశాలకు అమెరికా అంటే పడకపోవడానికి కారణం సీఐఏనే అని తెలుస్తోంది. రష్యా విదేశాంగ మంత్రి బ్రెజిల్ అధ్యక్షుడిని కలిసిన తర్వాత అక్కడ  పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. బ్రెజిల్ అధ్యక్షుడు అమెరికా,, యూరోపియన్ దేశాలపై మాటల దాడి కొనసాగిస్తున్నారు. అయితే గతంలో బ్రెజిల్ యూరప్ దేశాలతో 100 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది.  అమెరికా లాటిన్ అమెరికా దేశాల్లో చొరబాటుకు దిగుతుందని రష్యా ఆరోపించింది.

చైనా 2000 సంవత్సరంలో కేవలం 12 బిలియన్ డాలర్ల వ్యాపారం మాత్రమే చేసింది. కానీ ప్రస్తుతం 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వ్యాపారం చేసేది. ఇప్పుడది 450 బిలియన్ డాలర్లకు చేరింది. బ్రెజిల్, వెనిజులా దేశాల్లో ప్రస్తుతం చైనా నే నెంబర్ వన్ దేశంగా మారింది. 140 బిలియన్ డాలర్ల అప్పు కూడా ఇచ్చిందని చెప్పింది. అలాగే బైడెన్ సమావేశాలకు మెక్సికో, క్యూబా దేశాలు కూడా హాజరు కాలేదు. ప్రజాస్వామ్య సదస్సు కూడా పెడితే అటెండ్ కాలేదు. ప్రజాస్వామ్య సదస్సుకు కూడా బ్రెజిల్ దేశం హాజరు కాలేదు. దీంతో రష్యా ఆరంభించిన రివర్స్ గేమ్ అమెరికాపై బాగానే నడుస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: