గ్రేట్‌: ప్రపంచ రికార్డులు నెలకొల్పుతున్న భారత్‌?

భారతదేశాన్ని తమ శక్తియుక్తులతో, తెలివితేటలతో ప్రపంచ దేశాలు అన్నిటిలోనూ నెంబర్.1గా నిలపాల్సింది పోయి, కొన్ని  సీనియర్ పార్టీలు కూడా అమెరికన్, యూరప్ ని ఫాలో అయ్యి, ఆ దేశాన్ని ఈ దేశాన్ని ఫాలో అవుతూ ఫాలోవర్ గా మిగిల్చారు తప్ప క్రియేటర్ గా మార్చలేదు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా ప్రపంచానికి మేధోవలస జరుగుతున్న దేశంగా ఉండి కూడా మన దగ్గర ఎందుకు మార్పులు చేసుకోకూడదని ఆలోచించలేదు.

దాని పర్యావసనం డిపెండెంట్ కంట్రీగా మిగిలిపోయింది భారతదేశం. అమెరికా అలా ఉంది దాన్ని అందుకోవాలి, చైనా ఇలా ఉంది దీన్ని అందుకోవాలి అని ఆలోచించింది తప్ప తన గురించి తాను తెలుసుకోలేక పోయిందని మేధావుల అభిప్రాయం. అయినా సరే అలాంటి మన భారతదేశంలో అణు పరీక్షలు దగ్గర నుంచి వచ్చిన మార్పు ఒక ఎత్తైతే, టెక్నాలజీ పరంగా అమెరికా, బ్రిటన్ లు కూడా సాధించలేనంత వేగాన్ని భారత్ ఇప్పుడు సాధిస్తుంది.

సామాన్య పేద ప్రజల దగ్గర నుంచి కూడా, అన్ని చిన్న వర్గాలు కూడా ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్ కోసం క్యూఆర్ కోడ్ ను వాడుతున్నటువంటి వేళ టెక్నాలజీలో భారత్ గతంలో కన్నా ఎంతో అభివృద్ధి సాధించిందని, అది అన్ని వర్గాల వారు కూడా అందుకోగలుగుతున్నారని ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది. దానికి సజీవ సాక్ష్యంగా మనీ పర్పస్ వాడే యూపీఐ ట్రాన్సాక్షన్లలో, అది మొదలైనప్పటినుండి చూస్తే హైయెస్ట్ రికార్డును నెలకొల్పింది భారత్.

లాస్ట్ మంత్ ట్రాన్సాక్షన్ రికార్డును చూస్తే 870 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగి, అతి పెద్ద రికార్డు గా నిలిచింది. దాని ద్వారా బదిలీ అయిన డబ్బులు 14.05 లక్షలు కోట్లు అని తెలుస్తుంది. అంటే 14.05 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఒక్క మార్చి నెలలో జరగడం అతిపెద్ద విశేషం. 29-30 కోట్ల ట్రాన్సాక్షన్లు రోజుకి నడుస్తున్నాయి. ఇది భారతదేశం సాధించినటువంటి, సాధిస్తున్నటువంటి సాంకేతిక ఆర్థిక విప్లవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: