ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?

తనతో పెట్టుకోవద్దు అని చెప్పే వాళ్ళని కూడా గిల్లి మరి చూసే ఎలన్ మస్క్ భారత్ విషయంలో మాత్రం ఈ మధ్యన కొంత వెనక్కి జంకుతున్నాడని తెలుస్తుంది. ఆ మధ్యన చాలా రెచ్చగొట్టాడు కూడా. టెస్లా కార్ల విషయంలో టాక్స్ ఎక్సమ్ప్షన్ ఇవ్వమంటే ఇక్కడికి వచ్చి ప్లాంట్ పెట్టుకోండి అప్పుడు ట్యాక్స్ మినహాయింపు ఇస్తామని చెప్పింది మోడీ సర్కార్. దాన్ని అప్పుడు ఎలన్ మస్క్ అపహాస్యం చేశాడు. మేమొచ్చి అక్కడ ప్లాంట్స్ పెట్టుకోకపోతే మీరు చేయరా? ఎవరికోసం చేయరు, రేపొద్దున్న మీ జనాభా మా కారులని అడగరా అంటూ వ్యాఖ్యానించాడు.

అయితే దానికి భారత్ సరే నీ పని నువ్వు చేసుకో అంటూ వదిలేసింది. గతంలో అమెరికా నుండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా భయపెడితే భయపడిపోయేవి మన గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం మాత్రం ఇలాంటి వాళ్లకు మొండిగా సమాధానం ఇస్తుంది. భారత్ పై మాటల దాడి తోనో, ఎమోషనల్ గేమ్ నడిపితేనో కుదరదు అని ఎలన్ మస్క్ కి అర్థమైంది.

 బీబీసీ వాళ్ళు గుజరాత్ మీద చేసిన డాక్యుమెంటరీ తీసేయమని చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటికీ కూడా ఆదేశాలు పంపించింది మోడీ సర్కార్. బీబీసీకి సంబంధించిన ఈ డాక్యుమెంటరీని తీసేసింది. భారత్ అలా చెప్పగానే మీరు ఇలా తీసేస్తారా అని కొంతమంది భారతదేశ ద్వేషులు లాంటి వాళ్లు ఎలన్ మస్క్ ని అడిగారు.

దానికి ఎలన్ మస్క్ మాకు ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి అరెస్టు అయ్యి జైళ్ల లోకి వెళ్లడం, లేదంటే ఆ దేశ చట్టాలను బట్టి నడవడం. భారతదేశంలో పనిచేస్తున్న వాళ్లు అక్కడ ఉన్న చట్టాలను బట్టి నడవాల్సిందే కదా. అట్లా నడవకుండా ఎట్లా ఉంటాం. మేము మా వాళ్ళని తీసుకెళ్లి జైళ్ళలో పెట్టుకోమంటారా అని అడిగారట. దాంతో ఎలన్ మస్క్ ని కూడా దారికి తెచ్చిన దేశంగా భారతదేశం కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: