వివేకా హత్య: సునీత పోరాటం ఫలిస్తుందా?

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు త్వరగా కావాలని గట్టిగా కోరుకుంటున్నారు సునీత. ఎందుకంటే నాలుగు సంవత్సరాలుగా ఆయనను హత్య చేసిన నిందితులు ఎవరు, చేయించిన వాళ్ళు ఎవరో  తెలియక కోర్టు చుట్టూ  తిరిగింది ఎందుకంటే తననీ, తన భర్తని కాపాడుకోవడం కోసం ఇలా త్వరగా దర్యాప్తు సాగాలని, హత్య చేసిన వాళ్ళకి శిక్ష కూడా త్వరగా పడాలని కోరుకుంటున్నారు అని వైయస్సార్సీపికి సంబంధించిన వాళ్ళ అభిప్రాయం.

వీటన్నిటి మధ్య సుప్రీంకోర్టు చేసిన ప్రొసీడింగ్స్ 70% ఆమెకు ఫేవర్ అయితే 30% మైనస్ అయినట్టుగా తెలుస్తుంది. ఫేవర్ ఏమిటంటే సీబీఐ విచారణ విషయంలో ఎలా చేయాలో తెలిపే తెలంగాణ హైకోర్టు ఆర్డర్స్ ను కొట్టేసింది సుప్రీంకోర్టు. ఏం కొట్టేసింది అంటే పేపర్ మీద లిఖిత పూర్వకంగా ఉండాలి, ఇంకా ఉత్తర్వులలోని కొన్ని కోణాలను ప్రాజెక్ట్ చేయడం వాటిని తప్పు పట్టి కొట్టేసింది సుప్రీంకోర్టు.

మైనస్ ఏంటంటే సునీత దర్యాప్తు వేగంగా కొనసాగాలని కోరుకుంటుంది. సుప్రీం కోర్టు మొన్నటి వరకు విచారణ ఏప్రిల్ నెలాఖరుకి అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ విచారణను కాస్త కోర్టు జూన్, జూలై వరకు రెండు, మూడు నెలలు వెనక్కి జరిపినట్టు తెలుస్తుంది. విచారణ త్వరగా జరగాలని కోరుకుంటున్న సునీతకి, విచారణ కాస్త జూన్, జూలై వరకు రెండు మూడు నెలలు వెనక్కి జరగడం అనేది ఒక గట్టి జలక్ అనే చెప్పాలి.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ను ఏప్రిల్ నెలాఖరు నుండి జూన్, జూలై కి సుప్రీంకోర్టు పొడిగించిన నేపథ్యంలో విచారణ త్వరగా పూర్తి కావాలని, ఆ హత్య చేసిన వాళ్ళని, చేయించిన వాళ్ళని త్వరగా అరెస్టు చేయాలని, వారికి త్వరగా శిక్ష పడాలని కోరుకుంటున్న సునీతకి ఈ వాయిదా అనేది ఎదురవడంతో తన కోరిక నెరవేరనట్టు అయిపోయింది. ఇక త్వరగా అరెస్టు జరగడం అనేది సుప్రీంకోర్టు చేతిలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: