తెలంగాణ పల్లెల్లో.. ఆ విప్లవం వస్తోందా?

పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి. ఇందుకు అవకాశం కల్పించేలా తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధి శాఖ జిల్లా పంచాయతీ అధికారులు, జెడ్పీ సీఈఓలు, డీఆర్డీఓలకు హైదరాబాద్ లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో రెండు రోజుల అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనికి జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు పొందిన గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు కూడా హాజరయ్యారు. పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

50 శాతం గ్రామాల్లో వైకుంఠ ధామాలను ఇంకా వినియోగించడం లేదు. నీటి సరఫరా, విద్యుత్, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించి సత్వరమే వినియోగంలోకి తేవాలి. పల్లె ప్రకృతివనాలను ప్రజలకు వినియోగoలోకి, క్రీడా ప్రాంగణాలు నిర్మించి వదలివేయకుండా గ్రామీణ యువతను సమన్వయ పరిచి వినియోగంలోకి తేవాలి. గ్రామ పంచాయితీలకు ఇచ్చిన ట్రాక్టర్ల ద్వారా తడి, పొడి చెత్త సేకరించి వర్మి కంపోస్టు తయారు చేసి, విక్రయించి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.

కేంద్ర, రాష్ట్ర నిధులతో పాటు పంచాయతీలు శాశ్వత ఆదాయం పొందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. డంపింగ్ యార్డుల నిర్వహణ, నాటిన చెట్ల సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్న మంత్రి ఎర్రబెల్లి... ఉపాధిహామీ పనుల విషయంలో 19 బృందాలు పరిశీలించి పనుల నాణ్యతను ప్రశంసించాయని తెలిపారు.  907 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రావాల్సి ఉందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఖాళీ స్థలాలను గుర్తించి ఆదాయం చేకూర్చేలా వెదురు, టేకు, గoధం, తదితర చెట్ల పెంపకం చేపట్టి సంపదవనాలు సృష్టించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రజాప్రతినిధులకు సూచించారు. పచ్చదనం పెరగడంతో పాటు ఆదాయం పెంపొందించే దిశలో ప్రభుత్వం త్వరలో తగు చర్యలు చేపట్టనున్నట్లు సీఎస్  చెప్పారు. గ్రామాల్లోని యువతను భాగస్వాములను చేసి ప్లాస్టిక్ వినియోగo నిర్మూలించాలని సీఎస్ శాంతికుమారి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: