సూడాన్‌లో అరాచకం: షాపింగ్స్‌ మాల్స్ లూటీలు?

సూడాన్ లో ఇప్పుడు అరాచకం నడుస్తుందని తెలుస్తుంది. చివరికి సూడాన్ రాజధాని కూడా ఇప్పుడు రెబల్ చేతిలోకి వెళ్ళిపోయిందట. మొన్న ఒక భారతీయుడు కూడా చనిపోయిన సందర్భంలో అక్కడ భారత రాయబారి యొక్క కార్యాలయం భారతీయులను ఎవరిని బయటికి రావద్దని చెప్పడం అయితే అక్కడ జరిగిందట. సూడాన్ జనాభా 48మిలియన్ల మంది. ఇప్పటివరకు ఈ విధ్వంసకాండలో వందమంది వరకు చనిపోయారని ఇంకా 1100 మంది వరకు గాయాలు పాలయ్యారనే విషయం తెలుస్తుంది.

ఆందోళన కార్ల మీద అక్కడ ప్రభుత్వం ఎయిర్ స్ట్రైక్స్ చేయిస్తుంది. అక్కడ రాజధాని  కాటూన్ ప్రాంతం లోని ఎయిర్ పోర్టు మీద దాడి జరిగిందట. బుల్లెట్లు, రాకెట్లు పేలుతున్నాయి అక్కడ. ఏ గ్రూపు వాళ్ళు దాడి చేస్తున్నారో కూడా ఎవరికి అర్థం అవ్వనటువంటి పరిస్థితి అయితే నెలకొంది అక్కడ. ఈ దెబ్బకి షాపింగ్ మాల్స్ లో, సూపర్ మార్కెట్స్ లో  ఓ పక్కన లూటీలు జరుగుతుండగా కార్లలో దేశాన్ని విడిచి పారిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 1956 వరకు సూడాన్ ని బ్రిటన్ ఇంకా ఈజిప్ట్ వాళ్లు కలిసి పరిపాలించారు. ఆ తర్వాత వదిలేసి వెళ్లిపోయేటప్పుడు సైనిక పాలకులు ఫీల్డ్ మార్షల్ ఉమర్ ఆల్బషీర్ ఆక్రమించుకున్నారు. అప్పటినుండి తన పాలనలో ఉంది.

అప్పటి నుంచి సైనిక పాలకులు రోజుకొకరు పరిపాలించినా 1989 నుంచి 2019 వరకు ఫీల్డ్ మార్షల్ ఉమర్ ఆల్బషీర్ ప్రభుత్వం నడుపుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన మీద తిరుగుబాటు చేసి, అరెస్టు చేయించి అబ్దుల్ ఫతర్ అల్ భుహాన్ నాయకత్వం వహించాడు. 1983 నుండి 2005 వరకు జరిగిన సివిల్ వార్ లో ట్రాన్సిషన్ సావర్నిటీ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేసి డాక్ పూర్ రీజియన్ లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటూ వచ్చాడు. 2003 నుండి వీళ్లతో పోరాటం సాగుతోంది. ఈ పోరాటంలో అరబ్ దేశాలు కాసేపు వీళ్ళకి సహకరిస్తే, కాసేపు వాళ్లకు సహకరిస్తున్నాయి అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: