ఆ విషయంలో తన్నుకుంటున్న చైనా, పాకిస్తాన్‌?

పాకిస్తాన్ చైనాల మధ్య మతపరమైన చిచ్చు రాజుకుంటున్నట్లుగా తెలుస్తుంది. చైనాకు సంబంధించిన ఫ్యాక్టరీ అధికారిని అక్కడ అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని అక్కడ ఉన్న ముస్లింలు చంపబోయారు. కారణం ఏమిటి అని అడిగితే  దైవ ద్రోహం చేశాడని అంటున్నారంట. విషయం ఏమిటి అంటే చైనా పాకిస్తాన్ లో పెట్టుబడులు పెడుతుంది.

అక్కడ మైనింగ్ అది తవ్వేటువంటి ఫ్యాక్టరీ కి సంబంధించిన సూపర్వైజర్, అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ముస్లిం కుర్రాడు దైవ ప్రార్థనల పేరుతో ఫ్యాక్టరీకి లేటుగా వస్తున్నాడని, మిగిలిన వాళ్ళందరూ టైంకి వస్తున్నారు కదా, నువ్వు ఒక్కడివే దైవ ప్రార్థనల పేరుతో లేటుగా వస్తున్నావని చెప్పగానే అతను వెళ్లి వాళ్ళ మనుషులకి చెప్పి అతను దైవ దూషణ చేస్తున్నాడు, అతనిని చంపేయాలి అనగానే అక్కడున్నటువంటి ముస్లిం సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఫ్యాక్టరీని ధ్వంసం చేసి ఆయన్ని చంపేయడానికి ప్రయత్నించిందట.

పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగి అతనిని కాపాడి వేరే ప్రాంతానికి తీసుకెళ్ళిపోయింది. కానీ అతన్ని  ఉరి తీసే వరకు మేము ఊరుకోమని చెప్తున్న పరిస్థితి అక్కడ ఒక వైపు నెలకొందట. మరో వైపు చైనా అతనిని ఏమైనా చేస్తే ఊరుకోమని చెప్తుంది.  కైబర్ ఫక్తూనా ప్రాంతానికి సంబంధించిన కుమ్మేళ దగ్గర ఈ సంఘటన జరిగింది. చైనా ఇంజనీర్ పేరు దియాన్.  హైడ్రో పవర్ ప్లాంట్స్ కి సంబంధించిన ఫ్యాక్టరీలో ఆయన ఇంపార్టెంట్ వ్యక్తి. ఇతని దగ్గర పని చేస్తున్నటువంటి వాళ్ళలో ఒక కుర్రాడు తప్పు చేస్తున్నాడు అని అడిగిన నేపథ్యంలో, అల్లాని అవమానించారంటూ ఆందోళన ప్రారంభించారు‌. జనాలు రోడ్ల మీదకు వచ్చి ఆయన్ను చంపాలంటూ ఉద్యమాలు చేశారు.

చివరికి సైన్యం గాల్లో కాల్పులు జరిపితే అప్పటికైతే కంట్రోల్ అయింది గానీ ఆందోళనలు అయితే ఆగలేదు. చైనా తన దేశంలో ఉన్న వీళ్ళనే అంగీకరించదు. రంజాన్ కార్యక్రమాలను జరగనివ్వదు. అట్లాంటి చైనా ఆ వ్యక్తికి ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అని హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: