భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

భారత్ రష్యాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం జరగబోతుందా అంటే అవును అనే సంకేతాలే వినపడుతున్నాయి. పుతిన్ ఇండియాకి వచ్చిన సందర్భంలో అది జరగబోతుందట. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే ఏమిటంటే రష్యాలో మన వ్యాపారాలు ఎటువంటి ఒత్తిడి లేకుండా పెట్టుకోవచ్చు. అలానే రష్యా కూడా ఇక్కడ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టుకోవచ్చు. డైరెక్ట్ గా అనుమతులు వచ్చేస్తాయి.

కానీ అది ఏ ఏ రంగాల్లో అన్నటువంటి  విషయాన్ని స్టడీ చేస్తున్నారు. రష్యాకి ఇప్పుడు ప్రధానంగా ఫుడ్ బిజినెస్ లలో సమస్యలు వచ్చాయి. కేజీఎఫ్ లు, మెక్ డోనాల్డ్స్ లాంటివన్నీ ఎత్తేశారు అక్కడ. కాబట్టి మన వాళ్ళు అక్కడ పెట్టుకోవచ్చు. అలాగే ఫార్మా కంపెనీలు మూసేశారు. కానీ రా మెటీరియల్ దొరుకుతుంది.  ఆ రా మెటీరియల్తో తయారు చేసుకోగల నైపుణ్యం మనకు ఉంది. అలాగే మనం ఇక్కడ నుండి ఫార్మాని ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. గోధుమలకు సంబంధించిన వ్యాపారాలు ఇతర రా మెటీరియల్స్ కి సంబంధించిన వ్యాపారాలకి భారతదేశం లోకి వాళ్లు, వాళ్ల దేశంలోకి మనం వెళ్లి చేసుకునేందుకు ఒప్పందాలు కుదురుతున్నాయి.

దీనికి సంబంధించిన ప్రిపరేషన్ చేసే పనిలో అధికార యంత్రాంగం ఉంది. వాణిజ్య ఒప్పందంతో ద్వైపాక్షిక ట్రయల్స్‌ను మరింత బలోపేతం చేయాలని భారత్ రష్యా యోచిస్తోంది.  న్యూఢిల్లీ మరియు మాస్కో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి.  ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని విస్తరిస్తున్న భారత్ మరియు రష్యాలతో ద్వైపాక్షిక పెట్టుబడి సంబంధాలను మరింత పెంచే వాణిజ్య వ్యాపారాల ముందస్తు ఒప్పందంపై ఇరుపక్షాలు చర్చించినట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.  

గత నెలలో రష్యా ఇరాక్ స్థానంలో భారతదేశం యొక్క పెద్దదైన రా మెటీరియల్ సరఫరాదారుగా నిలిచింది.  మాస్కో కూడా న్యూ ఢిల్లీలోని టాప్ 5ట్రేడింగ్ భాగస్వాముల్లో ఒకటిగా ఉంది. మాస్కో అత్యధికంగా వ్యాపారం జరుపుతుంది ఢిల్లీతో అంటే మన ఇండియాకు అనేది ఇక్కడ ముఖ్య విషయం. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరగబోతుందని జయశంకర్ చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: