జగన్‌లో అవినాష్‌ అరెస్ట్ టెన్షన్‌ పెరుగుతోందా?

ఓవైపు అవినాష్ రెడ్డి అరెస్ట్ కి సిద్ధపడుతూ ఉండడం, ఇంకా విచారణ సందర్భంగా వసతి దీవెన ఈ నెల26న ఇస్తారని తెలుస్తుంది. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ కూడా రద్దు అయిందని ప్రచారం కూడా జరుగుతుంది. కానీ దీంట్లో దేంట్లోనూ కూడా అవినాష్ రెడ్డి అనే పదం రాకుండా వీటన్నిటికీ అవినాష్ రెడ్డి విషయంతో సంబంధం లేకుండా డైవర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని మేమే ఉండమన్నాము అని చీఫ్ సెక్రటరీ ఇప్పుడు ముందుకు వచ్చిన సంగతి.

ఎందుకు అంటే సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంలో మళ్లీ వాళ్లు పాలసీ మేటర్స్ అడుగుతుంటారు, వెంటనే మీ ప్రభుత్వాన్ని అడిగి చెప్పమంటారు. అట్లాంటప్పుడు ఆయన విదేశాల్లో ఉంటే కష్టం కాబట్టి మేము ఆగమని చెప్తే ఆయన ఆగారు. కానీ దీని వెనక దురుద్దేశాలు ఏమీ లేవని ఆయన అన్నారు. ఒక పక్కన లాభీయిస్ట్ విజయకుమార్ గురించి సుబ్బారెడ్డి, ఆయన లాభీయిస్ట్ కాదు. రామోజీరావు బంధువుల కోసం వచ్చారు. దానికి మేము ఆశీర్వచనం ఇప్పించుకుంటూ వచ్చాం. దాన్ని ఇక్కడ తప్పుపడుతున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ఇందులో విజయ్ కుమార్ స్వామి గురించి మీరు మార్గదర్శి కేసు నుంచి బయటకు పడేందుకు వచ్చారని నిలదీయడం ఒక ఎత్తయితే, విజయ్ కుమార్ స్వామి వచ్చిన ప్రత్యేక విమానం రామోజీరావు బంధువు వియ్యంకుడు నవయుగ విశ్వేశ్వరరావుది కాదా, ఆయన కుమారుడు శశిధర్, విజయ్ కుమార్ స్వామి అందులో ఉంది నిజం కాదా, మార్గదర్శి కేసు నుంచి బయటపడేందుకు స్వామీజీని పిలిపించారు.

2017-18లో  రామోజీరావు బంధువుల గృహప్రవేశానికి కూడా విజయకుమార్ స్వామి నవయుగ విశ్వేశ్వరరావు, శశిధర్ తో కలిసి వచ్చారు కదా, మరి అప్పుడు ఎందుకు వచ్చారు అనుకోవాలి? మీరు చెప్పినవన్నీ దైవ కార్యాలనుకోవాలా అంటూ ఆయన ప్రశ్నించుకుంటూ వచ్చారు. ఆయనని తీసుకొచ్చాక అవినాష్ రెడ్డి కేసు వాయిదా పడింది కాబట్టి ఆయన మహిమ అనుకుంటూ ఉండొచ్చని వీళ్ళు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: