ఇంత రచ్చ అవుతున్నా.. తమ్మినేని మౌనమే?

స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడే. ఆయన తెలుగుదేశం పార్టీలోకి రాకముందే కదా చదువుకుంది. తెలుగుదేశం పార్టీ ఆయన్ని మంత్రిని చేసింది తర్వాత ఎమ్మెల్యేని కూడా చేసింది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున సీతారాం తనను వదిలిపెట్టి వైసీపీలోకి చేరాక ఆయన లూప్ హోల్స్ ని కనిపెట్టడం మొదలుపెట్టిందని తెలుస్తుంది. ఆయన గురించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నండూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ డిగ్రీ చదువుని మధ్యలోనే ఆపేసిన సీతారాం లా కోర్సును ఎలా చదివారని ప్రశ్నించారు.

ఈ న్యూస్ ఎప్పుడు పత్రికల్లో జనరల్ పేజీల్లోనే వస్తూ ఉంది. కానీ సమాధానం మాత్రం సీతారాం నోటి వెంట రావడం లేదని అంటున్నారు. ఇలా ప్రశ్నించిన దీనిపై ఆయన సమాధానం చెప్పాలి కదా అంటున్నారు కొంతమంది. ఒకవేళ ఆ డిగ్రీ కూడా వేరే డిగ్రీ చేసి తర్వాత లా కోర్స్ చేశారా అన్నటువంటి విషయం ఆయన క్లారిటీ ఇవ్వాలి కదా అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాని సర్టిఫికెట్ల గొడవ ఇప్పుడే వస్తుంది ఏమిటి. అంటే ఆయన టిడిపిలో ఉన్నప్పుడు చేస్తే టిడిపికి తెలియలేదా, లేదంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్లకి తెలిసి కావాలని ఊరుకున్నారా అనేదే ప్రశ్న ఇప్పుడు.

మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ కు చెందిన అసెంబ్లీ స్పీకర్ డిగ్రీ మధ్యలోనే ఆపేసినా నకిలీ సర్టిఫికెట్ తో మూడేళ్లు ఎల్ఎల్బి కోర్సు చేశారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నండూరి నర్సిరెడ్డి ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని  మహాత్మా గాంధీ కాలేజీలో లా కోర్స్ లో చేరడానికి సర్టిఫికెట్లు ఎక్కడ నుండి వచ్చాయి, ఎవరు ఇచ్చారో తమ్మి రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నకిలీ సర్టిఫికెట్లు కొని ప్రవేశం పొందిన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ పై ఓయూ అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: