పేద ముస్లింల కోసం దుబాయ్‌ షేక్ దాతృత్వం?

రంజాన్ మాసంలో పేద ముస్లింలను ఆదుకోవడానికి దుబాయ్ షేక్ పెద్ద కార్యక్రమం చేపట్టారు. 1 బిలియన్ పేద ప్రజలకు ఆహారం అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. దీని కోసం నాలుగు బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నారు. క్యాంపెన్ వెబ్ సైట్, కాల్ ద టోల్ ఫ్రీ నెంబర్ అని రెండు నెంబర్లు ఇచ్చారు. దాతలు, డొనేట్ చేసే వారు ఇద్దరు దీనికి కాల్ చేయొచ్చు.

దీనికి అరబ్ ఇండియా స్పైసెస్ గ్రూప్ 1.3 మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించింది.  గల్ప్ ఇస్లామిక్ ఇన్వెస్ట్ మెంట్ 2. 7 మిలియన్ డాలర్ల ఎమౌంట్ ను ప్రకటించింది. 1.3 మిలియన్ డాలర్లను యూఎస్ మిలియనీర్స్ ఇచ్చారు. దుబాయ్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఇచ్చిన పిలుపుకు వివిధ సంస్థలు స్పందించాయి.

గతంలో కూడా వీరు ఇలాంటి కార్యక్రమం చేపట్టారు. ఒక బిలియన్ మీల్స్ పేద ముస్లింలకు అందజేశారు. అయితే మొదట 10 వేల మందికి అందించిన ఈయన. ప్రస్తుతం మిలియన్ రెండు మిలియన్ల మందికి ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ రంజాన్ మాసం లో మంచి ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

దీనిపై  ప్రపంచ మేధావులు, అంతర్జాతీయ నిపుణులు దుబాయ్ షేక్ ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈయన చేస్తున్న పనిని అభినందిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం దుబాయ్ సంపన్న దేశంగా విరాజిల్లుతోంది. ఎంతో మంది వలస వాదులకు ఉపాధి చూపెడుతూ ఆదుకుంటోంది. ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్ లాంటి దేశాల్లోని ఎంతో మంది పౌరులు దుబాయ్ లో ఉపాధి పొందుతున్నారు. దుబాయ్ లో రంజాన్ మాసాన్ని ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటూ నెల రోజులు అల్లాను స్మరిస్తూ ధాన ధర్మాలు చేస్తుంటారు. రంజాన్ మాసంలో ధాన ధర్మాలు చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని భావిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: